మధ్యప్రదేశ్‌ అఖిల భారత యువజన కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ రిటర్నింగ్‌ అధికారిగా భోగ జగదీష్‌ నేత

నాంపల్లి గాంధీభవన్‌ ప్రజాబలం ప్రతినిధి: అఖిల భారత యువజన కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ.. భోగ జగదీష్‌ నేత ను మధ్యప్రదేశ్‌ రిటర్నింగ్‌ అధికారిగా నియమించింది.
మధ్యప్రదేశ్‌ లో ప్రస్తుతం జరుగుతున్న యూత్‌ కాంగ్రెస్‌ స్టేట్‌ ప్రెసిడెంట్‌ ఎన్నికకు ఎన్నికల అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ ఎన్నికల కమిటీ.
మధ్యప్రదేశ్‌ యూత్‌ కాంగ్రెస్‌ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు.. ఆల్‌ ఇండియా యూత్‌ కాంగ్రెస్‌ ఎన్నికల నియమనిబంధనలు అమలు చేస్తూ.. సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి ఆరుగురు రిటర్నింగ్‌ అధికారులను నియమించింది.
అందులో తెలంగాణ కాంగ్రెస్‌ నుంచి భోగ జగదీష్‌ సేవలను గుర్తించి.. మధ్యప్రదేశ్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా అవకాశం కల్పించింది.
మధ్యప్రదేశ్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా నియమిస్తూ.. %I్‌జ% ఉత్తర్వులు జారీ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking