మంత్రి పొన్నం ప్రభాకర్
జూబ్లీహీల్స్ ప్రజాబలం ప్రతినిధి: ముఖ్యమంత్రి బనకచర్ల ఇష్యూ ,రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించి బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు శాసనసభ స్పీకర్ కి లేఖ రాస్తే శాసన సభ వేదికగా మేము చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి తెలిపారు..
జరిగే శాసన సభలో ఎ అంశంపై అయిన చర్చ కు సిద్ధమని అర్ధరాత్రి వరకు సమయం ఇచ్చాం..
ఈ సమస్య కు కారకులైన మీరు చేస్తున్న రాజకీయాలపై వాస్తవాలు తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో దేవాలయం లాంటి శాసన సభ వేదికగా చర్చ కు సిద్ధం..
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన శాసన సభ్యుడు చర్చ చేయాల్సింది శాసన సభలో కాదనీ అని పాత్రికేయుల కార్యాలయం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో చర్చ చేద్దామని సవాలు చేస్తున్నారు
ప్రెస్ క్లబ్ వాళ్ళే ప్రభుత్వం కి సంబంధించి మాతో మీతో చర్చిస్తామంటే కచ్చితంగా వస్తాం
మీరు బహిరంగ చర్చకు అక్కడికి పిలవడం సరైన విధానం కాదు..
మీకు ప్రజలు ఇచ్చిన శాసన సభ్యుడిగా చర్చ సభలో చేయాలి
ప్రభుత్వ విధానాలు అంశాల పై మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం.
కెటిఆర్ కి సవాలు చేస్తున్న చర్చ బషీర్ బాగ్ లో కాదు శాసన సభలో చేద్దాం.. తెలంగాణ ప్రజలు లైవ్ చూసేటప్పుడు చర్చ చేద్దాం..
ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ తో లేఖ రాయించండి
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి చూపిస్తాం..
బెషజాలాలు లేవు బేసిన్ లు లేవు అన్న వారితో ఏం మాట్లాడతాం..
సంవత్సరాల కోసం ఎన్నిక కాబడిన ప్రభుత్వం ఉంది
ఇది ఎన్నికల సమయం కానీ కోడ్ ఉన్న సమయం కాదు మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం
శాసన సభ లో చర్చిద్దాం రండి
ఇతర బీఆర్‌ఎస్ నాయకులు ,కాంగ్రెస్ నాయకులు చర్చిద్దమనడం వేరు.. ప్రజాస్వామ్యం లో ఎన్నికైన శాసన సభ్యులం
మాజీ మంత్రివి ,శాసన సభ్యుడివి ఎక్కడ చర్చ చేద్దామో తెలియదా..
మేము చర్చకు వెనుకబడే వాళ్ళం కాదు
గత 10 సంవత్సరాలుగా తెలంగాణ కు నష్టం జరిగేలా తీసుకున్న నిర్ణయాలు తీసుకుంది మీరు..
మీరు చేసిన తప్పులు ప్రజల ముందు పెట్టినాము ..
మీరు జగన్మోహన్ రెడ్డి తో తీసుకున్న నిర్ణయాలు ఓపెన్ సీక్రెట్
రెడ్ కార్పెట్ వేసి నీళ్లు తీసుకుపోయింది మీరే కదా..
రాయలసీమ రత్నాల సీమ చేస్తామని మేము అన్నమా..? అది దానిని పరిపాలిస్తున్న ప్రభుత్వం బాధ్యత
తెలంగాణకు అన్యాయం జరిగిందే మీ హయాంలో
మా ప్రాంత రైతుల హక్కులు కాపాడే బాధ్యత మాది..
తెలంగాణ బిడ్డను ఎవరికి వ్యతిరేకం కాదు.. తెలంగాణ కు అన్యాయం జరిగితే ఎవరితో కాంప్రమైజ్ కాము..
గోదావరి నికర జలాలు వరద జలాలు మా హక్కు..
రాయలసీమ కు వ్యతిరేకం కాదు..కానీ ఇక్కడి నీళ్ళు అక్కడికి ఇస్తామని చెప్పడానికి మీరు ఎవరు
మా నీళ్ళు మాకు ఇచ్చిన తరువాత మీ నీళ్ళు మీరు తీసుకోండి..
10 ఏళ్లలో తెలంగాణ కు అన్యాయం చేశారు..
భవిష్యత్ తరాలకు తెలిసేలా శాసన సభలో చర్చిద్దాం..
ప్రతిపక్ష నాయకులు లేఖ రాస్తే శాసన సభ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు..