సభకు విచ్చేసిన ఏఐసీసీ పెద్దలకు ధన్యవాదాలు.
టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్…
నాంపల్లి గాంధీభవన్ ప్రజాబలం ప్రతినిధి:నిన్న హైదరాబాద్ లో జరిగిన సామాజిక న్యాయ సమరభేరి అద్భుతంగా విజయవంతం కావడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడి కృషి ఫలితమని ప్రతి కార్యకర్తకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
సభను విజయవంతం చేసేందుకు కార్యకర్త నుంచి రాష్ట్ర నాయకుల వరకు అందరూ అహర్షిశలు కృషి చేశారని సభ పెద్దఎత్తున విజయవంతం అయిందని రాష్ట్రంలో ప్రతి మారుమూల నుంచి నాయకులు సభలో పాల్గొన్నారని ఆయన అన్నారు.
సభకు పిలవగానే రాష్ట్రానికి విచ్చేసి 2 రోజులపాటు ఇక్కడే ఉండి పీసీసీ పీఏసీ సమావేశాలలో కార్యవర్గ సమావేశంలో సభలో పాల్గొన్న ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ క్యాడర్ కు ఎంతో స్ఫూర్తినిచ్చారని అన్నారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కె.సి వేణుగోపాల్, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కార్యదర్శి విశ్వనాధన్, మంత్రులు అందరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
సభ ను విజయవంతం చేసేందుకు మండల అధ్యక్షులు, బ్లాక్ నాయకులు, డీసీసీ అధ్యక్షులు, ఎంపీ లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజక వర్గ ఇంచార్జ్ లు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఎంతో కృషి చేశారని అన్నారు
సభ సక్సెస్ ప్రతి ఒక్కరి కృషి అని, సభ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి అన్ని సజావుగా జరిగేలా కృషి చేసిన వారికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.