నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన ఏకైక విద్యాసంస్థ
నాణ్యమైన విద్యాబోధన అందించడమే మా పాఠశాల ద్యేయం కరస్పాండెంట్ నరాల సంతోష్.
వేములవాడ టౌన్ – మే 02 ( ప్రజాబలం ), తెలంగాణ రాష్ట్రంలో బుధవారం రోజున వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో వేములవాడ పట్టణానికి చెందిన హంసిని డీజీ స్కూల్ విజయ దుందుభి మోగించింది. మొత్తం 2024-25 విద్యా సంవత్సరానికి గాను 47 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరుకాగా 47 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై, 100% ఉత్తీర్ణత సాధించారు. రుక్విత్ అనే విద్యార్థి 570/600, శాన్వి570/600, మహావీన్ 568/600, సాయి చరణ్ 566/600, వైశాలి 561/600, మార్కులు సాధించి హంసిని డిజి స్కూల్ కీర్తి కిరీటాన్ని మరోసారి ఎగురవేశారు.47 మంది విద్యార్థులకు గాను 26 మంది విద్యార్థులు500 పైగా మార్కులు సాధించి వేములవాడ పట్టణంలో నెంబర్ వన్ స్థానంలో హంసిని డీజీ స్కూల్ సొంతం చేసుకుంది. ఈ విజయానికి సహకరించిన విద్యార్థులకు, ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులకు, అలాగే పిల్లల తల్లిదండ్రులకు పాఠశాల కరస్పాండెంట్ నరాల సంతోష్ అభినందనలు తెలియజేస్తూ మంచి క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే మా పాఠశాల ద్యేయం అనీ అన్నారు.