ఖమ్మం ప్రతినిధి మే 01 (ప్రజాబలం) ఖమ్మం విద్యుత్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటి అనుబంధ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో పలుచోట్ల మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించినారు. పాల్గొని ప్రసంగించిన ఎం. ప్రసాద్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పలుచోట్ల ర్యాలీ నిర్వహించారు జండా ఆవిష్కరించి సమావేశాలు నిర్వహించినారు దీనిలో అన్ని రకాల కార్మికులు పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమాలలో జిల్లా కార్యదర్శి కామినేని నాగేశ్వరరావు, డివిజన్ నాయకులు సత్యనారాయణ రెడ్డి సీతయ్య, కృష్ణమూర్తి గంటా శీను ,గోపిరెడ్డి రామయ్య, రాజశేఖర్ సత్యనారాయణ ,బూరుగు రవి, ఎల్వి కృష్ణారావు శ్రీకాంత్ దావూ ద్ నీలా తదితరులు పాల్గొన్నారు ట్రాన్స్కో డిస్కౌo కార్మికుల మేడే జండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తున్న రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం ప్రసాద్ గారు ఈ సందర్భంగా కార్మికుల హక్కుల కోసం విద్యుత్ శాఖలో రావలసిన సౌకర్యాల కోసo దేశవ్యాప్త భారత బందులో విద్యుత్ ఉద్యోగులు పాల్గొనబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేసి, హక్కుల కోసం యూనియన్ లకు అతీతంగా పాల్గొనవలసినదిగా ఉద్యోగ భద్రత కోసం భవిష్యత్తు కోసం కార్మికులంతా ఏకం కావాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా నొక్కి చెప్పినారు ఖమ్మం లో అనేక సెంటర్లలో ఖమ్మం రీజినల్ కమిటీ టౌన్ డివిజన్ కమిటీ ,రూరల్ డివిజన్ కమిటీ, ఏదు లాపురం సబ్ డివిజన్ కమిటీ కూసుమంచి సబ్ డివిజన్ కమిటీ ,లింగాల కమిటీ మధిర సబ్ డివిజన్, వైరా, సత్తుపల్లి ,ఏనుకూరు అనేక చోట్ల మేడే జెండాలను సిఐటియు నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి జండా ఎగరవేసి కార్మికుల హక్కుల కోసం 20 న భారత్ బంద్ కోసం కార్మికులను సిద్ధపరిచి ప్రసంగించినారు