ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ మే 1:
మేడే దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ అత్యున్నతస్థాయి అవార్డు “శ్రమశక్తి” అవార్డును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ ఇతర మంత్రుల చేతుల మీదుగా కె.కె – 5 గనిలో అసిస్టెంట్ చైన్ మాన్ గా విధులు నిర్వహిస్తున్న ఐ.ఎన్.టీ. యూ.సీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులుగా, సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ కేంద్ర కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాంశెట్టి నరేందర్ అందుకున్నారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ అవార్డును తీసుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తనకు ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు జాతీయ అధ్యక్షులు డాక్టర్ జి. సంజీవరెడ్డి కి, ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బి జనక్ ప్రసాద్ కి ఎల్లపుడు రుణపడి ఉంటానని అన్నారు. ఈ అవార్డు తన పై ఇంకా బాధ్యతను పెంచిందని, కార్మికుల న్యాయమైన హక్కులకై, వారి సమస్యల పరిష్కారానికై పాటుపడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐ.ఎన్.టీ.యూ.సి కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షుడు కాంపెల్లి సమ్మయ్య, ఏరియా ఉపాధ్యక్షుడు దేవి భూమయ్య, కేంద్ర సంయుక్త కార్యదర్శి జగన్నాథ చారి, ఏరియా కార్యదర్శి దొరిశెట్టి చంద్రశేఖర్, నాయకులు శ్రీనివాస్, సంపత్,బాబు తదితరులు పాల్గొని నరేందర్ కు అభినందనలు తెలిపారు.