దివ్యాంగులను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలి…

 

హైదరాబాద్, జనవరి 21: బ్లూ ఫౌండేషన్, ఎనేబుల్డ్ ఇండియా, క్యాడర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సంకల్ప మేళా’ లాలాపేట్‌లో విజయవంతంగా జరిగింది. లాలాపేట్‌లోని జయశంకర్ క్రీడా మైదానంలో బుధవారం జరిగిన ఈ మేళాను జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలతా శోభన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. దివ్యాంగులకు సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థలను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన నిర్వాహకుల కృషిని ఆమె అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దివ్యాంగుల్లో అపారమైన ప్రతిభ దాగి ఉందని, ఆ ప్రతిభను గుర్తించి అన్ని రంగాల్లో వారికి సముచిత అవకాశాలు కల్పించాలని సూచించారు. దివ్యాంగుల సాధికారతే సమాజ అభివృద్ధికి మార్గమని ఆమె పేర్కొన్నారు. ఈ మేళాలో నిర్వహించిన సభలో ఎనేబుల్ ఇండియా సీఓఓ మోజెస్ చౌదరి, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) డైరెక్టర్ కృష్ణమూర్తి, తెలంగాణ యాంటి నార్కోటిక్స్ బ్యూరో డీఎస్పీ కె. సైదులు, ఇన్‌స్పెక్టర్ కె. శ్రీనివాసరావు, క్యాడర్ సంస్థ డైరెక్టర్ హరిబాబు, మేనేజర్ మల్లికార్జున్, బ్లూ ఫౌండేషన్ డైరెక్టర్ వి. క్రాంతి కిషోర్, హెలెన్ కెల్లర్ సంస్థ చైర్మన్ ఉమర్ ఖాన్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. మేళాలో సుమారు 40 స్వచ్ఛంద సంస్థలు దివ్యాంగులకు అందిస్తున్న సేవలను వివరించేందుకు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశాయి. పెద్ద ఎత్తున ప్రజలు స్టాళ్లను సందర్శించి, దివ్యాంగుల సంక్షేమానికి అందుబాటులో ఉన్న పథకాలు, సేవలపై అవగాహన పొందారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking