పాల్గొన్న ఎంపీ అనిల్ కుమార్, కమిషనర్ ఆర్ వి కర్ణన్,
ఎమ్మెల్యే ముఠా గోపాల్ , స్థానిక కార్పొరేటర్ లు
సికింద్రాబాద్ ప్రజాబలం ప్రతినిధి:హైదరాబాద్ జిహెచఎంసి లో సికింద్రాబాద్ జోన్ పరిధిలో 10.50 కోట్ల రూపాయల తో నూతనంగా నిర్మించిన కవాడిగూడ , ముషీరాబాద్ సర్కిల్ కార్యాలయాలు హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయ లక్క్ష్మీ, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత ,ఎమ్మెల్యే ముఠా గోపాల్, జీహెచఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఇతర ముఖ్య నేతలు, అధికారులు తదితరులు పాల్గోన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సికింద్రాబాద్ జోన్ లోని కవాడీగూడా , ముషీరాబాద్ సర్కిల్ కార్యాలయాన్ని పరిపాలన వికేంద్రీకరణ లో ప్రజల సాల్యభం కోసం భాగంగా రింగ్ రోడ్డు లోపల ఉన్న గ్రామ పంచాయతీ లు , మున్సిపాలిటీ లు ,కార్పొరేషన్ లు ఒకే రకమైన వ్యవస్థకి తీసుకురావడం జరిగిందని అన్నారు. ప్రణాళికబద్ధంగా అభివధి జరగడానికి ప్రజా పాలన ప్రభుత్వం అన్ని వ్యవస్థలు ఒకే గొడుగు కిందికి తీసుకురావడం జరిగింది. 12 జోన్స్, 60 సర్కిళ్లు ,300 వార్డులతో ఏర్పడింది వాటికి జోనల్ కమిషనర్లు , డిప్యూటీ కమిషనర్లు ,ఇతర అధికారులను నియమించుకోవడం జరిగింది. జీహెచఎంసీ లో విలీనమైన ప్రాంతాల అభివద్ధిపై ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకువోడం జరిగింది. హైదరాబాద్ కాలుష్యం ఢిల్లీ లాంటి పరిస్థితి రాకుండా ఉండాలన్న ఒక కార్యాచరణ తో ముందుకు పోతున్నామని అన్నారు.
