కేరళ హై స్కూల్ లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

 

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 05 (ప్రజాబలం) ఖమ్మం జిల్లాలోని ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం లో గల కేరళ హై స్కూల్ మంగళ వారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు కళాశాల డైరెక్టర్ భైరబోయిన సంపత్ అధ్వర్యంలో చాలా ఘనంగా జరిపారు.డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యా యిను లందరినీ ఘనoగా సన్మానం చేశారు సమాజంలో ఉపాధ్యాయుల యొక్క బాధ్యత గురుతరమైనదని తల్లిదండ్రుల తరువాత గురువు యొక్క ప్రభావశీలత విద్యార్థులపై ఎక్కువగా ఉంటుందని, భవిష్యత్తులో గొప్ప పౌరులుగా ఎదిగినటువంటి విద్యార్థులు. అందరూ తమకు చదువు చెప్పినటువంటి గురువులను మర్చిపోకుండా, గౌరవభావాన్ని కలిగి ఉండాలని,” ఈ సందర్భంగా పిల్లలకు ఉద్బోధించారు కొంతమంది విద్యార్థులు విద్యార్థినులు ఉపాధ్యాయ వేషంలో అలరిం చారు తరువాత కొంతమంది విద్యార్థులు కూడా ప్రసంగిస్తూ ఉపాధ్యాయుల గొప్పతనాన్ని గురించి తోటి విద్యార్థినులకు తెలియజేశారు. అనంతరం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు.ఈ సందర్భంగా పిల్లలందరికీ మిఠాయి పంపిణీ చేశారు

Leave A Reply

Your email address will not be published.

Breaking