గవర్నర్‌ కార్యాలయాలు బీజేపీ ఆఫీసులుగా మారిపోయాయి, దేశానికి ఈ సభ ఒక దిక్సూచీ కేరళ సీఎం

ఖమ్మం ప్రతినిధి జనవరి 18 (ప్రజాబలం) ఖమ్మం
దేశంలో గవర్నర్‌ కార్యాలయాలు బీజేపీ ఆఫీసులుగా మారిపోయాయని కేరళ సీఎం పినరయి విజయన్‌ అన్నారు. కేంద్ర మంత్రులు నేరుగా సుప్రీం కోర్టును బెదిరిస్తున్నారని అన్నారు. . ఉపరాష్ట్రపతి కూడా సుప్రీంను కించపరిచేలా మాట్లాడరని విమర్శించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని రాజ్యాంగాన్ని కాపాడాలని అన్నారు.

ఖమ్మంలో నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ దేశానికి ఒక దిక్సూచి అని కేరళ సీఎం పినరయి విజయన్‌ అన్నారు. పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పారు. రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాల్సిందేనని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కేసీఆర్‌ పోరాటానికి మా మద్దతు ఉంటుందని ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking