ఖమ్మం ప్రతినిధి జనవరి 18 (ప్రజాబలం) ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం ప్రజలు రాజకీయంగా చైతన్యవంతులని అన్నారు. చారిత్రక ఖమ్మం నగరం జన సంద్రంగా మారిందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఆరోపించారు. విపక్ష నేతలను కేసుల పేరుతో వేధిస్తోందని మండిపడ్డారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులతో పాటు ప్రజలను నట్టేట ముంచారని విమర్శించారు. దేశ వ్యాప్తంగా రైతుల్ని ఆదుకోకపోగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఇష్టానుసారం రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని అన్నారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ.. విపక్ష నేతలను భయపెట్టాలని చూస్తోందని వెల్లడించారు. మోడీకి మిగిలింది 400 రోజులే అని, అందుకే రోజులు లెక్కబెట్టుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.