ఖమ్మం ప్రతినిధి జనవరి 18 (ప్రజాబలం) ఖమ్మం లో జరిగే కెసిఆర్ బి ఆర్ ఎస్ పార్టీ సభకు సంబందించి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దిశెట్టి సామేలు అరెస్ట్ నీ తీవ్రంగా ఖండించిన ఆర్పీఐ పార్టీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కన్వీనర్ పేరం శివ నాగేశ్వరరావు, నేషనల్ కౌన్సిల్ మెంబర్ ప్రభుదాస్, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండీ ఫయాజ్, తెలంగాణ రాష్ట్ర ఓబీసీ అధ్యక్షులు దిశగానీ సంపత్ గౌడ్.
పేరం శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇది పూర్తిగా హక్కుల ఉల్లంఘన అని, కెసిఆర్ సభ పెడ్తే రాజకీయ పార్టీలు, కుల సంఘాలు నాయకులను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని, ఈ విషయాన్ని కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ మంత్రివర్యులు శ్రీ రాందాస్ అతవాలే దృష్టికి తీసుకెళతామని తెలిపారు.