ఖమ్మం ప్రతినిధి జనవరి 18 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా ఖమ్మంలో బి ఆర్ ఎస్ పార్టీ అధ్వర్యంలో ఖమ్మం లో జరిగే సభకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వస్తున్న నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దిశెట్టి సామేలు గారిని ఈరోజు తెల్లవారు జామున 5 గంటలకు సత్తుపల్లి పోలీసులు అక్రమ అరెస్ట్ చేసి ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం జరిగింది. కెసిఆర్ సభ నేపథ్యంలో జిల్లాలోని నాయకులను అరెస్ట్ చేయడం సమంజసం కాదు. ఈ విషయాన్ని భారతీయ సర్వ సమాజ్ మహసంఘ్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం