ఘనంగా ప్రపంచ పశు వైద్య దినోత్సవ వేడుకలు

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..శనివారం జిల్లా పాలనాధికారి సమావేశం మందిరంలోప్రపంచ పశు వైద్య దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి హాజరై మాట్లాడుతూ పశు సంవర్థక శాఖ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలను అభినందిస్తూ,శాఖ లో అండమార్పిడి,కృత్రిమ గర్భధారణ,తదితర అందుబాటు లోకి తీసుకొని వచ్చి రైతులకు మేలుజాతి దూడలను అదించాలని అన్నారు. అదే విధంగా జిల్లా లో పాడి అభివృద్ధి కి,రైతులకు పశు పోషణ,పశుగ్రసాల పెంపకం,పాల దిగుబడి పై, పెరటి కోళ్ల పెంపకం, పొట్టేలు పిల్లల పెంపకం లో శిక్షణ తరగతులు నిర్వహించి జిల్లా లో పాలు, మాంసం,గుడ్ల ఉత్పత్తి ని పెంపొందించాలని అధికారులకు సూచించారు.
అనంతరం పదవీ విరమణ పొందిన జిల్లా అధికారులను జిల్లా పాలనాధికారి సన్మానించారు, వారి లో
డా,,ప్రభాకర్, డా, గజ్జారం
డా,,నారాయణ రెడ్డి,
ఉన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు పాలనాదికారి రాంబాబు ,జిల్లా గ్రామీణభివృద్ధి అధికారి విజయలక్ష్మి, జిల్లా పశు వైద్య, పశు సంవర్షక శాఖ అధికారి డా,,శంకర్ జిల్లా లోని వివిధ మండలాల్లో పని చేస్తున్న పశు వైద్యాధికారులు , రిలయన్స్ ఫౌండేషన్ కో ఆర్డినేటర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking