అమలులో చిత్తశుద్ధి నిరూపించుకున్న ఏపీ సీఎం జగన్
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇన్చార్జి కర్రి వేణుమాధవ్
అనకాపల్లి ఏప్రిల్ 29 ();జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ బోను దుర్గా నరేష్ యాదవ్ అధ్యక్షతన ఈరోజు అనకాపల్లిలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ముఖ్యఅతిథిగా బీసీ మహాసభ జరిగింది ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థి విభాగం కన్వీనర్ మురళీకృష్ణ మరియు వారి బృందం పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికారి ప్రతినిధి ఢిల్లీ ఇన్చార్జి బీసీ ఫైర్ బ్రాండ్ లీడర్ కర్రి వేణుమాధవ్ మాట్లాడుతూ దేశంలో 75 సంవత్సరాలు దాటి స్వతంత్రం వచ్చి కూడా బీసీలకు దక్కవలసిన వాటా దక్కలేదని రాజ్యాంగం రచించిన నాడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బీసీలకు ఆర్టికల్ 340 ప్రకారం ఏ కుల జనాభా ఎంత మంది ఉంటే అంత మంది చట్టసభల్లో ఉండాలని ఆనాడే పొందుపరిచారని కానీ భారతదేశంలో రాజ్యాంగాన్ని నేటికీ 121సార్లు పైగా మార్పులు చేసిన ప్రభుత్వాలు 56% ఉన్న దేశంలో బీసీల కోసం ఒక్కసారి కూడా పార్లమెంట్లో బిల్లు పెట్టకపోవడం బీసీలను అవమానించడమేనని దీనికై ఎంతకైనా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో పోరాటాలు మరింత ఉద్ధృతం చేస్తామని వేణుమాధవ్ తెలియజేశారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆరోజు రాసిన రాజ్యాంగంలోని విషయాలను నేడు దేశంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో అమలు జరుగుటం పట్ల వేణుమాధవ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి కి సభా ముఖంగా అభినందనలు తెలియజేశారు దేశంలో రాజకీయ పార్టీలు రాజ్యసభ సభ్యత్వాన్ని 100 కోట్లకి 200 కోట్లకు అమ్ముకుంటుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 50% బీసీలకు నామినేటెడ్ పదవుల్లోనూ రాజ్యసభ ఎమ్మెల్సీలు మంత్రి పదవులు సైతం బడుగు బలహీన వర్గాలకు కేటాయించడం దేశంలోనే గొప్ప మార్పుకు నాంది అని వేణుమాధవ్ తెలియజేశారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అంటే పేరులోనే బీసీ ఉంది అని బడుగు బలహీన వర్గాలకు పేద కులాలకు విద్య వసతి ఉద్యోగ రాజకీయ రంగాల్లో వచ్చే 50 సంవత్సరాలుగా చైతన్యం అభివృద్ధి రాజ్యాధికారం వైపు పేద కులాల్ని ముందుకు తీసుకు వెళుతున్న గొప్ప సామాజిక ఉద్యమ సంఘం అని ఈ సంవత్సరం జూన్ కి బీసీ ఉద్యమ నాయకుడు టైగర్ ఆర్ కృష్ణయ్య గారి ఉద్యమ ప్రస్థానం 50 సంవత్సరాలు అయిన సందర్భంగా అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సమగ్ర కులాల గణన చేపట్టడం కోసం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ సమాచార మరియు సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చేస్తున్న సేవలకు గాను ఇద్దరు బిసి నాయకులకు విశాఖపట్నంలో సువర్ణకంకణ దారణ కార్యక్రమం జరుగుతుందని ఉత్తరాంధ్ర వైసీపీ ఇంచార్జ్ టీటీడీ చైర్మన్ పెద్దలు శ్రీ వై వి సుబ్బారెడ్డి ముఖ్యఅతిథిగా బీసీ గర్జన కార్యక్రమం చేపడుతున్నట్టుగా వేణుమాధవ్ తెలియజేశారు బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు బీసీల కులగణన కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ రిజర్వేషన్ల కోసం వైజాగ్ బీసీ గర్జన కి పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా కర్రి వేణుమాధవ్ పిలుపునిచ్చారు అనకాపల్లిలో బీసీ గర్జన ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన బోన్ దుర్గా నరేష్ పిల్ల నివాస్ మురళీకృష్ణ చందు మరియు కాక మహిళా నాయకురాలకు అభినందనలు తెలిపారు.
Prev Post
వరి కొనుగోలు,మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు
Next Post