వరి కొనుగోలు,మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 29 : మంచిర్యాల జిల్లాలోని లోని దండేపల్లి మండలంలోని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు దండేపల్లి గ్రామం లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం,వరి కొనుగోలు కేంద్రం చింతపల్లి గ్రామం లో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. శనివారం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…‌‌తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని.రైతులందరూ దళారులను నమ్మి మోసపోకుండా సొసైటీ ఆధ్వర్యంలో ప్రారంభించిన రైతు కొనుగోలు కేంద్రాల్లో ఉపయోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న,ఎంపీపీ గడ్డం శ్రీనివాస్,మండల పార్టీ అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్,పిఎసిఎస్ చైర్మన్ కసనగోటి లింగన్న,పిఎసిఎస్ చైర్మాన్ బెడద సురేష్,లక్షెట్టిపేట ప్రజాప్రతినిధులు,సర్పంచులు, ఎంపీటీసీలు,ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking