సుశీల్ బాబు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం ….. మంత్రి హరీష్ రావు

 

సంగారెడ్డి, ఏప్రిల్ 29 ప్రజ బలం ప్రతినిది: గుండెపోటుతో రెండు రోజుల క్రితం మరణించిన సంగారెడ్డి జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు సుశీల్ బాబు కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటా మని రాష్ట్ర ఆర్థిక ,వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు భరోసానించారు.
శనివారం మంత్రి సంగారెడ్డి లోని సుశీల్ బాబు ఇంటికి వెళ్లి సుశీల్ బాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
వారి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు.సుశీల్ బాబు మరణం తీర్చలేని లోటన్నారు.
వారికి ఏ సమస్యలున్న అధికారుల దృష్టికి, తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు.
తెలంగాణఉద్యమంలో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
వాళ్ళ కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని మంత్రి కోరారు.
మంత్రి వెంట జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, టి ఎస్ ఎం ఐ డి సి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింత ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్,
తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking