కేంద్ర ప్రభుత్వానికి రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య హెచ్చరిక
అనకాపల్లి ఏప్రిల్ 29 ();పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో 50% రిజర్వేషన్లు పెట్టాలని మరియు కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని అలా లేని పక్షంలో ఉద్యమాన్ని ఉదృతం చేసి దేశ వ్యాప్తంగా ధర్నాలు – నిరసనలు చేస్తామని అనకాపల్లిలో జరిగిన బి.సి.ల మహా సభలో రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ బిసి సంక్షేమ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య తెలిపారు. ఈరోజు దుర్గా నరేశ్ అద్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, అస్సాం, ఒరిసా తదితర రాష్ట్రాలలో పర్యటించి బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ లో అన్నీ జిల్లాలలో భారీ బహిరంగ సభలు జరపాలని నిర్ణహించారు. బీసీలు పార్టీలకతీతంగా బలమైన బీసీ ఉధ్యమాన్ని నిర్మించాలని కోరారు. త్వరలోనే దేశవ్యాప్త పర్యటన చేస్తాను అని అన్నారు. ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ ఈ దేశంలో గత 75 సంవత్సరాల గా పాలించిన కేంద్ర ప్రభుత్వాలు బీసీలకు ఏ రంగంలో కూడా జనాభా ప్రకారం వాట్ ఇవ్వలేదు. ఉద్యోగ రాజకీయ ఆర్థిక సామాజిక రంగాలలో కనీస ప్రాతినిధ్యం లభించలేదు ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యంలో అన్ని సామాజిక కులాలకు వారి వారి జనాభా ప్రకారం అన్ని రంగాలలో వాటా ఇవ్వాలి కానీ 70 సంవత్సరాలు గడిచిన వాటా ఇవ్వడం లేదు. బి.సి లంటే ఉత్పత్తి కులాలు. దేశ సంపద సృష్టిస్తున్నారు. కాని సంపద అనుభవించే హక్కు లేదు. అవకాశం లేదు. పన్నులు కట్టే దేశ బడ్జెట్ ఇస్తున్నారు. కాని బడ్జెట్ లో కనీస వాటా లేదు. ఓట్లు వేసి అధికారం ఇస్తున్నారు. కాని అధికారులు బి.సి లకు వాటా ఇవ్వడం లేదు. ఈ దేశం లో బి.సిలకు ఇలా అన్యాయం జరుగుతుందన్నారు.ఇది ప్రజస్వామ్యదేశం అన్ని కులాలకు, సామాజిక వర్గాలకు వారి, వారి జనాభా ప్రకారం వాటా ఇవ్వాలి. అప్పుడు దేశంలో సమైక్యత, సమగ్రత, శాంతి ఉంటుంది. అందుకోసం బి.సి లకు రావలసిన వాటా కోసం మరోసారి అధ్యయనం జరుగాలి. బి.సి లకు రాజ్యాంగబద్దమైన హక్కులు-వాటా కల్పించవలసిన సమయం ఆసన్నమైనది. 75 సంవత్సరాల ప్రజాస్వామ్య వ్యవస్థలో 56 శాతం జనాభా గల బి.సి లకు రాజకీయ రంగంలో 14 శాతం, ఉద్యోగ రంగంలో 9 శాతం. పారిశ్రామిక రంగంలో ఒక శాతం, ప్రైవేటు రంగంలోని ఉద్యోగాలలో 5 శాతం ప్రాతినిథ్యం లేదంటే బి.సి లకు జనాభా ప్రకారం వాటా ఇవ్వవలిసిన ఆవశ్యకతను తెలుపుతుంది.బీసీలకు ఇచ్చేది బిక్షం కాదు. ఇది రాజ్యాంగ బద్ధమైన ప్రజాస్వామ్య హక్కు స్వాతంత్రం వచ్చినప్పుడు బీసీలకు అసెంబ్లీ – పార్లమ్మెటుల్లో రిజర్వేషన్లు పెట్టకుండా అన్యాయం చేశారు. ఉద్దేశపూర్వకంగా ఈ కులాలను అందిచేస్తున్నారని విమర్శించారు. త్వరలో సేకరించి బోయే జనాభా గణనలో కులాల వారిగా బీసీ జనాభా గణన చేయాలని సమావేశం కోరింది. ఎస్సీ/ఎస్టీల జనాభా ను కులాల వారిగా సేకరిస్తున్నారు. బీసీల జనాభా సేకరించడానికి అభ్యంతరాలు ఏమిటి? చట్టపరమైన, న్యాయపరమైన అవరోధాలు ఏమీ లేవు. పులులు తదితర జంతువుల లెక్కలు ఉన్నాయి. కానీ బిసి జనాభా లెక్కలు చేయాలంటే అనేక అభ్యంతరాలు చెబుతున్నారు. ఈ వైఖరి మార్చుకోకపోతే బీసీలు తిరగబడతారని హెచ్చరించారు. సుప్రీం కోడ్డు- హై కోర్టు బి.సి. జనాభా లెక్కలు సేకరించాలని 40 సం.రాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాయి. కానీ కేంద్ర పురుత్వం బి.సి జనాభా లెక్కలు తీయకుండా బికించి అన్యాయం చేస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని కులాలకు, సామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారం రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం కల్పించాలి. కానీ మనదేశంలో 56 శాతం జనాభా కలిగిన బీసీలకు ఇంతవరకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకుండా ఈ కులాలను అణచిపెట్టారు. ప్రపంచంలో అణచివేతకు వివక్షకు గురైన అన్ని వర్గాలకు, అన్ని రంగాలలో వాటా ఇచ్చి ఇతర అభివృద్ధి చెందిన వర్గాలతో సమానంగా అభివృద్ధి చేశారు. కానీ మనదేశంలో పీడిత కులాలను ఇంకా అంది వేయడానికి చూస్తున్నారు తప్ప అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. రాజ్యాధికారం ద్వారానే BC/SC/ST లు ధనవంతులవుతారు. కోటీశ్వరులవుతారు. ప్రతి ఒక్కరికి ఉచిత విధ్యా లభిస్తుంది. చదువుకున్న వారికి ఉద్యోగం లభిస్తుందన్నారు. భూములు లేని వారికి భూములు వస్తున్నాయి. గుడిసెలు యున్నవారి ఇల్లు స్థానంలో బంగ్లాలు వస్తాయి.ఈ వర్గాలను సమాజంలో గౌరవం పెరుగుతుంది. లేకపోతే దోపిడి వర్గాల రాజ్యంలో బలహీన వర్గాలు ఎలా అభివృద్ధి చెందుతారు. 75 సంవత్సరాల తర్వాత కూడా BC/SC/ST లు సబ్సిడీ బియ్యం కోసం పెన్షన్ల కోసం వేచి చూడవలసి వస్తుంది. పేద కులాలకు రాజ్యాధికారం వచ్చిన రోజు ఈ కష్టాలు ఉండవన్నారు. ప్రపంచంలో ప్రజాస్వామ్యం వచ్చిన తరువాత అన్ని దేశాల ప్రజలు అభివృద్ధి చెందుతున్నారు.
సమావేశంలో ఈ క్రింది తీర్మానాలు ఆమోదించారు :
1) పార్లమెంటులో బి.సి బిల్లు పెట్టి చట్ట సభలలో బి.సి లకు 50 శాతం రిజవేషన్లు కల్పించాలి.
2) కేంద్ర ప్రభుత్వo త్వరలో చేపట్టబోయే జనాభ గణనలో బి.సి కుల గణన చేపట్టాలి.
3) పంచాయతీరాజ్ సంస్థలో బి.సి రిజర్వేషన్లను 34 శాతం నుండి 52 శాతం కు పెంచాలి. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలి.
4) బి.సి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి.ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలి.
5) అసెంబ్లీ-పార్లమెంట్ సీట్లను 100 శాతం పెంచాలి. ఇలా పెంచిన సీట్లను ఇంతవరకు అసెంబ్లీ-పార్లమెంట్ గడప తొక్కని బి.సి కులాల వారికి నామినేటెడ్ పద్ధతి మీద ఆంగ్లో-ఇండియన్లకు ఇచ్చిన మాదిరిగా నామినేట్ చేయాలి.
6) కేంద్రంలో బి.సి లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. బి.సి ల అభివృద్ధికి విద్యా అభివృద్ధికి ప్రత్యేక స్కీములను రూపొందించాలి. ప్రత్యకంగా కేంద్ర స్థాయి లో స్కాలర్ షిప్ లు, ఫీజుల రియంబర్స్ మెంట్,ఉపాధి రంగంలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి.
7) ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా బి.సి లకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి “బి.సి యాక్టు”ను తీసుకరావాలి.
8) బి.సి ల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్ల పై ఉన్న క్రిమి లేయర్ ను తోలగించాలి.
9) రాష్ట్రంలో – కేంద్రంలో విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను బి.సి ల జనాభా ప్రకారం 27 శాతం నుండి 56 శాతం కు పెంచాలి.
10) ప్రపంచీకరణ సరళీకృత ఆర్ధిక విధానాలు రావడంతో ప్రైవేటు రంగంలో పెద్దయెత్తున పరిశ్రమలు వచ్చాయి. అందుకే ఎస్సీ/ఎస్టీ/బి.సి లకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు పెట్టాలి.
11) సుప్రీమ్ కోర్టు- హై కోర్టు జడ్జీల నియామకాలలో ఎస్సీ/ఎస్టీ/బి.సి లకు రిజర్వేషన్లు పెట్టాలి.
12) కేంద్ర స్థాయిలో రెండు లక్షా కోట్ల బడ్జెట్ తో బి.సి సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి.
13) కేంద్రంలో బి.సి లకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ మరియు ఫీజుల రియంబర్స్ మెంట్ స్కీము విధానం సాచురేషన్ పద్ధతిలో ప్రవేశపెట్టాలి. రాష్ట్రాలకు 80 మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వాలి.
14) జాతీయ బి.సి ఫైనాన్స్ కార్పోరేషన్ రుణాలకు విధించిన షరతులను ఎత్తివేయాలి. బి.సి కార్పొరేషన్ బడ్జెట్ ఏటా 50 వేల కోట్లు కేటాయించి ప్రతి కుటుంబానికి 10 లక్షల నుంచి 50 లక్షల వరకు 80 శాతం సబ్సిడి తో రుణాలు మంజూరు చేయాలి.
15) కేంద్ర ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలి.
ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం, జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిల్లీ ఇంచార్జ్ కర్రి వేణు మాధవ్,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కన్వినర్ దుర్గా నరేశ్ ,రాష్ట్ర మహిళా కన్వినర్ బిసి యువత రాష్ట్ర అద్యక్షులు పిల్ల శ్రీనివాస్,విద్యార్ధి సంఘం రాష్ట్ర అద్యక్షులు కసిరెడ్డి మురళి కృష్ణ,ఏపి కార్యదర్శి అశోక్,తదితరులు పాల్గొని ప్రసంగించారు.