బ్రిటిష్ ప్రధాని లండన్ పార్లమెంట్ ఎదురుగా బసవ విగ్రహం పెట్టారు.
రాబోయే తరాలకు తెలిసేలా పాఠ్య పుస్తకాల్లో కూడా బసవ గురించి చేర్చారు.
లింగాయత్ సమాజానికి తెలంగాణ ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పించింది.
…రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
సంగారెడ్డి ఏప్రిల్ 29 ప్రజ బలం ప్రతినిది:
జిల్లా కంది మండలంలో వీర శైవ లింగాయత్ భవన (బసవ భవన్) నిర్మాణానికి శంకస్థాపన చేసిన ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు. పాల్గొన్న ఎంపి బీబీ పాటిల్,
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ బసవేశ్వరుడు గొప్ప మాట చెప్పారు. ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేస్తే, పైకి వస్తారు అని చెప్పాడు. నేను అదే స్పూర్తితో పని చేస్తున్న.కుల రహిత సమాజం అని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నము. కానీ 12 శతాబ్దం లోనే ఆయన చెప్పారు.
అప్పుడే అంత గొప్ప ఆలోచన అంటే, ఆయన దైవ స్వరూపుడు. అంతటి గొప్ప వ్యక్తి గురించి నాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు.
బీబీ పాటిల్ అడగగానే ఒప్పుకొని, సీఎం కేసీఆర్ అధికారికంగా బసవ జయంతి నిర్వహిస్తున్నారు. గతంలో ఎవరు ఇలా చేయలేదు.
ఆత్మ గౌరవ భవనాలు కోసం హైదరాబాదులో కోకాపేటలోని ఎకరా స్థలం 30 కోట్ల విలువ కలిగిన భూమిని ఇవ్వడంతో పాటుగా రూ.10కోట్ల రూపాయలతో భవన నిర్మాణం చేయబోతున్నాం.
అత్మభవన గౌరవం మీ పిల్లలు చదివేందుకు, ఐక్యత పెరిగేందుకు, అన్ని సమాజాలకు ఈ భవనం ఉపయోగ పడుతుంది.
బసవేశ్వర స్వామి పేరు మీద ఉమ్మడి మెదక్ జిల్లాలో బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టాము..
కుల, మతాలు ఏవైనా భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉన్న దేశం మన భారత దేశమని, అందరూ కలిసి మెలసి ఉండాలన్న బసవేశ్వరుడి సూక్తులు ఆచరణలో పాటిద్దాము.ఓబీసీ రిజర్వేషన్ పై ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం లింగాయత్ సమాజాన్ని ఓబీసీ లో చేర్చాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తున్నది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గానీ ఆ పార్టీ నాయకులు గానీ దీన్ని పరిష్కరించేందుకు కృషి చేయాలి అని డిమాండ్ చేస్తున్నా. సమాజంలో మీరు ఎంతో నిజాయతీగా ఉంటారు. బవస స్ఫూర్తిని జీవితంలో పాటిస్తారు. ఇచ్చిన మాటను మీరు నిలబెట్టుకుంటారు.
*నిన్న సూపర్ స్టార్ రజనీకాంత్ గారు హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ, హైదరాబాద్ ఎంతో మారింది అని, న్యూ యార్క్ లాగా ఉంది అన్నరు.
*సీఎం కేసీఆర్ అభివృద్ధి బాగా చేశారు అన్నరు. 9 ఏళ్ల పాలనలో హైదరాబాద్ అభివృద్ది, తెలంగాణ అభివృద్ధి అందరికీ కనిపిస్తున్నది.
*పక్కరాష్ట్రంలో ఉన్న రజినీ కి అర్థమైంది, కానీ ఇక్కడే ఉన్న గజినీలకు మాత్రం అర్థం కావడం లేదు.
*కేసీఆర్ దించుతం, బి ఆర్ ఎస్ దించుతం అంటున్నరు కాంగ్రెస్ నాయకులు..ఎందుకు దించుతరు..??
*ఆసరా పింఛన్లు ఇస్తున్నందుకు దించుతరా…
*కళ్యాణ లక్ష్మీ కింద లక్ష రూపాయలు ఇస్తున్నందుకు దించుతరా..
*కేసీఆర్ కిట్ కింద పదమూడు వేలు ఇస్తున్నందుకు దించుతరా..
*రైతుబంధు కింద పదివేలు ఇస్తున్నందుకు దించుతరా
*రైతుబీమా కింద ఐదు లక్షలు ఇస్తున్నందుకు దించుతరా
*కాళేశ్వరంతో కోటి ఎకరాలకు సాగునీళ్లు అందిస్తున్నందుకు దించుతరా..
*ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాకుండా..టీహాబ్, వీహాబ్, టీఎస్ఐపాస్ తో పదిహేడు లక్షల ప్రైవేటు కోలువులు ఇస్తున్నందుకు దించుతరా..
*రెండు లక్షల ఉద్యోగాలు మేము ఇస్తే, నిరుద్యోగులను రెచ్చ గొట్టే ప్రయత్నం వారు చేస్తున్నారు.
*దొంగ దీక్షలు చేస్తూ దొంగే దొంగ అన్నట్లు చేస్తున్నారు.
ఈ కార్యక్రమం జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, ఎమ్మెల్యే క్రాంతి, చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, టిఎస్ ఎం ఎస్ ఐ డి సి ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్, సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి రవి, వైస్ చైర్మన్ లతవిజయేందర్ రెడ్డి, ఆర్డీవో నగేష్, కంది ఎమ్ ఆర్ వో మరియు లింగాయత్ సోదర సోరీమణులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.