ప్రజా బలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 07 : జర్నలిస్టులు సమాజ సేవకులని మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు.మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఏ బి జే ఎఫ్ క్యాలెండర్,డైరి ఆవిష్కరించి మాట్లాడారు.ఈ సందర్భంగా కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ…. జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలిచి ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య పరచాలని అన్నారు.జర్నలిస్టులు ప్రజాహితం కోసం పనిచేయాలని సూచించారు. ఏబిజేఎఫ్ జర్నలిస్టుల అభ్యున్నతికి పాటుపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబిజేఎఫ్ రాష్ట్ర నాయకులు ఎస్ వేణుగోపాల్,జిల్లా నాయకులు సిహెచ్ వేణుగోపాల్ శ్రీధర్,నరసింహచారి,మందల మల్లేష్,గంగన్న,మధు,బానుచంధర్,సతీష్,తిరుపతి,మల్లేష్, సందీప్,రాజు,రమేష్,ఖదీర్ ఖాన్,షాహిద్,ఫయాజుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.