మహబూబ్ నగర్ ఫిబ్రవరి 7 అబిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఘనంగా రమాబాయి 125 జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డాక్టర్ ఎస్. సరోజనమ్మ హాజరై ప్రసంగించారు.రమాబాయి ఫిబ్రవరి 7 తారీఖు 1898లో జన్మించింది మాత రమాబాయి ప్రపంచ మేధావిని తీర్చిదిద్ది దేశానికే దీపమయ్యారు. రమాబాయి బాబాసాహెబ్ ను గుర్తించిన అంతగా తన సొంత జాతి ప్రజలు విజయాలకు కారణమైన రమాబాయిను గుర్తించలేదని చెప్పాలి. తన త్యాగాల పునాదుల మీద బాబా సాహెబ్ యొక్క మేను పర్వతంగా తన నిలబెట్టింది డాక్టర్ అంబేద్కర్ గారి ఒక్కొక్క మెట్టు వెనుక రమాబాయి అమ్మ పంటి బిగువున గాయాలు ఉన్నాయి బాబాసాహెబ్ ఉన్నత చదువుల కోసం తాను ఎన్నో బాధలను అనుభవించింది. ఇల్లు గడవని స్థితిలో రమాబాయి పిడకలు చేసి అమ్మేవారు ఆ డబ్బులతో ఇల్లు గడిచేల చూడడమే కాకుండా అందులో కొంత డబ్బు డాక్టర్ అంబేద్కర్కి పంపించేవారు ఆమె జీవితకాల కష్టమే ఈ రోజున రాజ్యాంగం ద్వారా హక్కులు అన గారిన వర్గాల ప్రజలు అనుభవిస్తున్నారని అనడంలో సందేహం లేదు చివరికి 1935 మే 22న తుది శ్వాస విడిచారు.ఈ కార్యక్రమం లో రైకంతి రామదాస్, పాతూరి రమేష్, పరమేశ్వర్, అంజమ్మ, శ్రీ రాం కుమార్ తదితరులు పాల్గొన్నారు.