రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
రైతులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్ మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ విషయంలో రైతులకు ఎలాంటి ఆపోహ వద్దని, ఆందోళన చెందాల్సిన అవసర లేదని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ మున్సిపల్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు అరణ్య భవన్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తుందని, రైతులకు వ్యతిరేఖంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం డ్రాఫ్ట్ లను నిలిపివేసిందని, నిర్మల్ మాస్టర్ ప్లాన్ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. డ్రాప్ట్ పై రైతులు ఇచ్చిన వినతులు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసిన వారిలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, కౌన్సిలర్ ఆదుముళ్ళ పద్మాకర్, మాజీ కౌన్సిలర్ చెనిగారపు నరేష్, కౌన్సిలర్ తారక రఘు, రైతులు కొట్టే శేఖర్, దోంతుల రవి, గంగయ్య, అనుముల మోహన్, కత్రోజి గణేష్, కూన ఈశ్వర్, ద్యాగా దేవిదాస్, రాంచందర్ తదితరులు ఉన్నారు.