ప్రజలు సంక్రాంతి పండగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలి
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్
మేడ్చల్ ప్రజాబలం ప్రతినిధి జనవరి 13:
మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రజలు సంక్రాంతి పండగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండగ సకల సంపదలతో విరజిల్లాలని… కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా జరుపుకోవాలని ఆయన అన్నారు. సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన కాంతి తీసుకురావడంతో పాటు జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో పయనించాలని ఆకాంక్షించారు. ఈ సంక్రాంతి పండగ ప్రజల జీవితంలో నిత్యం కాంతులు విరిసిల్లాలి అన్నారు. అలాగే గాలిపటాలు ఎగురవేసే సమయంలో జాగ్రత్తలు పాటిస్తూ పండగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్ హరీశ్ కోరారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు.