విజయనగరం ఏప్రిల్ 22); ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని శనివారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇంచార్జ్ బీసీ ఫైర్ బ్రాండ్ లీడర్ కర్రి వేణుమాధవ్ మర్యాదపూర్వకంగా కలిసారు. మే మొదటి వారంలో విశాఖపట్నంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇంచార్జ్ బీసీ ఫైర్ బ్రాండ్ లీడర్ కర్రి వేణుమాధవ్ అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేయడానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సినిమాటోగ్రఫీ మరియు సమాచార శాఖ మంత్రివర్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సువర్ణ కంకణం బహూకరణ బీసీ సంఘాల చేతుల మీదుగా జరుగుతున్న కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ఉత్తరాంధ్ర ఇంచార్జ్ టిటిడి చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి గారినిఆహ్వానించినట్లు కర్రి వేణుమాధవ్ తెలిపారు.ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హాజరవుతున్నట్లు తెలిపారు.