డిగ్రీ కళాశాలలో ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం

 

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 9

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ అధ్యక్షతన తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది. తెలంగాణ ప్రజాకవి స్వర్గీయ కాళోజీ నారాయణరావు జయంతిని పరస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవం జరిపారు. కళాశాల ఇంఛార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ ఓదేల్ కుమార్ మాట్లాడుతూ కాళోజీ నారాయణ రావు తెలంగాణ భాషాభివృద్ధికి, సాహిత్య అభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు. ఒక సిరా చుక్క లక్ష మెదళ్లను కదిలస్తుందని నారాయణరావు పేర్కొన్నారని ఆయన తెలిపారు. తెలుగు భాషలోని తెలంగాణ భాషా, యాస ఔన్నత్వాన్ని వెలుగులోకి తెచ్చిన గొప్ప ప్రజాకవి కాళోజీ అని అయన గుర్తుచేశారు. తెలంగాణలోని బానిసత్వాన్ని, నిజాం నిరంకుశత్వాన్ని ఎండగట్టిన గొప్ప కవి నారాయణరావు అని తెలిపారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికే పూలమాలలు వేసి ఘనంగా నివాళులు ఆర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగు సహాయ ఆచార్యులు డాక్టర్ ఎం శ్యామల, సహాయ ఆచార్యులు డాక్టర్ కె రాజేంద్రం, డాక్టర్ కె. గణేష్, డాక్టర్ మాధవి, ఉమాకరణ్, శ్రీ రాపకుమార్, కిరణ్ కుమార్, డాక్టర్ ఇ రవి, పి. శ్రీనివాస్ రెడ్డి, ఎల్ రవిందర్, డాక్టర్ సుష్మా, డాక్టర్ రవి ప్రకాశ్, ప్రశాంత్, అరుణ్ రాజ్, సాయికుమార్, అనూష విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking