ప్రతి ఒక్కరు ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండాలి.

 

ప్రజాబలం ప్రతినిధి మంచిర్యాల జిల్లా డిసెంబర్ 27 : ప్రతి ఒక్కరు ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండాలని డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు. మంగళవారం
మంచిర్యాల నియోజకవర్గంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకునికి ఓటు హక్కు కలిగించే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రమించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పిలుపునిచ్చారు. హజీపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రామ,బూత్ స్థాయి కమిటీ ఎన్నికల సమావేశంలో సురేఖ పాల్గొని పార్టీ భవిష్యత్తు పై మార్గదర్శనం చేశారు. ఈసందర్భంగా సురేఖ మాట్లాడుతూ…మరో ఏడాదిలో ఎన్నికల సమర శంఖం పూరించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు సంకేతాలు అందుతున్న తరుణంలో ఇప్పటి నుంచే కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ప్రయోజనం కోసం పాటుపడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.అందులో భాగంగా ఓటు హక్కు పై 18 ఏండ్లు నిండిన యువకులను జాగృతం చేయాలని ఆమె సూచించారు.18 ఏండ్లు నిండిన యువకులకు ఓటు హక్కు కల్పించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చురుకుగా వ్యవహరించాలని ఆమె కోరారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సేవలు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు అవగాహన కల్పించడంలో కార్యకర్తలు సైనికుల్లా పాటుపడాలని అన్నారు.క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు రాత్రి పగలు నిరంతరం పాటుపడాలని అప్పుడే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో భాగంగా గ్రామ కమిటీలను ఎన్నుకున్నట్టు సురేఖ చెప్పారు.హాజీపూర్ మండల కేంద్రం గౌరవ అధ్యక్షుడిగా బైరి రాజయ్య, ఆధ్యక్షుడిగా మల్యాల రాజేశం, ఉపాధ్యక్షులుగా రావుల దుర్గయ్య, ప్రధాన కార్యదర్శిగా నరసయ్య, 105 వ బూతు అధ్యక్షుడిగా ఎల్లయ్య,106వ బూతు అధ్యక్షుడిగా మల్యాల తిరుపతి ఎన్నికైనట్టు డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ వెల్లడించారు.అలాగే హజీపూర్ మండలంలోని టీకానపల్లి గ్రామ కమిటీ గౌరవ అధ్యక్షునిగా బాలమల్లు,అధ్యక్షునిగా తవుడు సతీష్,ఉపాధ్యక్షుడిగా ఓరుగంటి తులసయ్య,ప్రధాన కార్యదర్శిగా పంసలా రవి, 107వ బూతు అధ్యక్షుడిగా బి సత్తయ్య,108వ భూత అధ్యక్షుడిగా తవుడు సురేష్ ఎన్నికైనట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు పుదరి తిరుపతి, హాజీపూర్ మండల్ అధ్యక్షుడు తోట రవి,డిసిసి ఉపాధ్యక్షులు రాజేశ్వరరావు,ఎంపీటీసీ డేగ బాపు,మాజీ ఎంపిటిసి రాజళింగు,నాయకులు శ్రీనివాస్ గౌడ్,శ్రీశైలం గౌడ్,పయ్యవులముని, బియ్యాల రమేష్,కుటుంబరావు, పత్తిపాక రాజయ్య,బాలమల్లు, రావుల పుష్ప,శాంత,మాజీ ఎంపీటీసీ సంధ్యారాణి,సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking