ప్రశంస అందుకున్న లక్షెట్టిపేట ఆరుగురు పోలీసులు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 13 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్లో సక్రమంగా సత్ప్రవర్తనతో విధులు నిర్వహించిన ఆరుగురు పోలీసులు రామగుండం సీపీ మేడం చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకోవడం జరిగింది.రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపెల్లి,మంచిర్యాల జిల్లాలోని పలు పోలీస్టేషన్లలో పనిచేసే పోలీసుల్లో ఉత్తమ ఉద్యోగులను ఎంపిక చేయగా లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఏఎస్సైలు పసర్తి రాజేందర్,డీజీ.రాజయ్యలతో పాటు స్టేషన్​ రైటర్లు సాంబారి రమేష్,రవి,బ్లూకోర్టు విధులు నిర్వహించే సత్యనారాయణ,డ్రైవర్ బీర్సాలు తమకు అప్పగించిన విధుల పట్ల సమర్తవంతంగా అంకితబావంతో పని చేసినందుకు గాను హర్షించి గురువారం రామగుండం కమీషనరేట్ కార్యాలయంలో సీపీ మేడం ప్రశంసా పత్రాలను సదరు ఉద్యోగులకు అందజేసారు. ప్రశంస అందుకున్న పోలీసు సిబ్బందిని పట్టణ సీఐ కృష్ణారెడ్డితో పాటు ఎస్సై లక్ష్మన్ అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking