ప్రజాబలం ప్రతినిధి వరంగల్ జూలై13:
ఆర్య వైశ్యలకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటును మేనిఫెస్టోలో పెట్టాలని చైతన్య పోరాట సమితి పోరాట సమితి వరంగల్ జిల్లా అధ్యక్షులు గుండా ప్రభాకర్ గుప్తా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. ఇటీవల భారతీయ జనతా పార్టీ లో
నూతనంగా రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్గా నియమితులైన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మంత్రివర్యులు గంగాపురం కిషన్ రెడ్డినీ కలిసి సన్మానించిన ఆయన ఆర్యవైశ్య కార్పొరేషన్ అంశాన్ని రానున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్పించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ఆర్యవైశ్యులను గుర్తించింది బిజెపి పార్టీ మాత్రమే అని బిజెపి పార్టీ పేద ఆర్యవైశ్యుల కోసం కార్పొరేషన్ కేటాయించాలని ఈ అంశాన్ని ఎన్నికల మ్యానుఫెస్టోలో పొందుపరచాలని ఈ సందర్భంగా వారిని కోరుకున్నట్లు తెలిపారు.