ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం
ఫార్మాసిటీ బాధిత రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపిన ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ, టీపీసీసీ కార్యదర్శి దండెం రాంరెడ్డి గారు.
ఫార్మాసిటీకి వ్యతిరేకంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, యాచారం మండలంకు చెందిన ఫార్మాసిటీ బాధిత రైతులు అందరూ ఫార్మాసిటీ వద్దు వ్యవసాయం ముద్దు, మా భూములు మాకు కావాలని గత రెండు రోజులుగా పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది, ఈరోజు (28.12.2022) రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కోదండ రెడ్డి గారు మరియు ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ, టీపిసిసి కార్యదర్శి దండెం రాంరెడ్డి గారు రైతులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దండెం రాంరెడ్డి గారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది, రైతుకు అండగా ఉండాల్సిన ప్రభుత్వమే రైతును హింసిస్తుందన్నరు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫార్మాసిటీ ని రద్దు చేసి రైతుల భూములు రైతులకు అప్పగించాలని, ఫార్మాసిటీ కోసం ప్రతిపాదించిన భూములకు రైతుబంధు, రైతు భీమా వర్తింపజేయాలని, ధరణి పోర్టల్ లో వారి పేర్లు నమోదు చేసి, వ్యవసాయ రుణాలు ఇవ్వాలని, రైతులకు ఇన్సూరెన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు, రైతులకు న్యాయం జరిగేవరకు రైతులు చేస్తున్న ఈ పోరాటానికి మా మద్దతు తెలుపుతాము, రైతుకు అండగా ఉంటాం అని దండెం రాంరెడ్డి గారు అన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈసీ శేకర్ గౌడ్ (మామ) గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొత్తకుర్మ శివకుమార్ గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పండల శంకర్ గౌడ్ గారు, స్టేట్ కిసాన్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ గుండ్ల వెంకట్ రెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కళ్లెం శ్రీధర్ రెడ్డి గారు, ఇబ్రహీంపట్నం NSUI అధ్యక్షులు నంద కిషోర్, కొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, చెన్నయ్య, సర్పంచ్ రమేష్, రాజశేఖర్ సర్పంచ్, రాజ్ శేకర్, ఉసియారి మధు, ఆలి భాయ్, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్ లు, కౌన్సిలర్ లు, వివిధ పార్టీలకు చెందిన ముఖ్యనాయకులు, పెద్ద ఎత్తున రైతులు, మహిళలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని రైతుల పాదయాత్రకు మద్దతు తెలపడం జరిగింది.