భద్రాచలం వెళ్ళిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

 

 

ప్రత్యేక విమానంలో వెళ్ళిన రాష్ట్రపతి, గవర్నర్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు

 

మేడ్చల్ ప్రజాబలం ప్రతినిధి డిసెంబర్ 28: శీతాకాల విడిదికై హైదరాబాదుకు వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన పర్యటనలో భాగంగా బుధవారం భద్రాచలం  వెళ్ళారు. ఈ సందర్భంగా  ఉదయం హకీంపేట విమానాశ్రయానికి చేరుకొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో  భారత వాయుసేన ప్రత్యేక విమానంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ కూడా కలిసి వెళ్ళారు. రాష్ట్రపతి భద్రాచలం వెళ్ళనున్న నేపథ్యంలో  హకీంపేట విమానాశ్రయంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ ఆధ్వర్యంలో  అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, నోడల్ ఆఫీసర్ రవి, డీసీపీ సందీప్, రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస మూర్తి, పేట్ బషీర్భాగ్ ఏసీపీ రామలింగరాజు ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking