– ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిది డిసెంబర్ 28: జాతీయ స్థాయి సైకిల్ పోలో పోటీలలో స్థానిక బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన క్రీడాకారులు కాంస్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండ జీవరత్నం తెలిపారు.డిసెంబర్ 20 నుండి 28 వరకు మహారాష్ట్ర లోని నాగపూర్ చెడికే కళాశాల మైదానంలో జరిగిన సైకిల్ పోలో పోటీలలో 28 రాష్ట్రాల కు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు.ఆశ్రమ పాఠశాలకు చెందిన సబ్ జూనియర్ వివిధ విభాగంలో వరలక్ష్మి,అంజలి, అహల్య కాంస్య పథకాలు సాధించగా జూనియర్ బాలికల విభాగంలో సునీత, రవళి,అనూషలు పథకాలు సాధించినట్లు తెలిపారు.జాతీయస్థాయి పోటీలలో పాల్గొని కాంస్య పతకాలు సాధించిన క్రీడాకారులను మంచిర్యాల డిటిడిఓ నీలిమ,ఏసిఎంఓ రాజమౌళి, ఏటీడీవో చిరంజీవి,ఏహెచ్ఎస్ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఏ గఫర్ తదితరులు అభినందించారు.