నిరుపేద జర్నలిస్ట్ కు అండగా నిలిచిన టీయూ డబ్ల్యూజె(టీజేఎఫ్)

నిరుపేద జర్నలిస్ట్ కు అండగా నిలిచిన
టీయూ డబ్ల్యూజె(టీజేఎఫ్)

భుజస్కంధాలపై మోసిన జర్నలిస్టులు.

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 28 (ప్రజాబలం) ఖమ్మం లోని శ్రీరక్ష హాస్పిటల్ లో పాశం వెంకటేశ్వర్లు కు సర్జరీ ముగిసింది.డాక్టర్లు వెంకటేశ్వర్లు ను ఇంటికి తీసుకెళ్లొచ్చని సూచించారు.45 రోజులు బెడ్ పై పడుకునే ఉండాలని డాక్టర్లు తెలిపారు.పేషెంట్ ను
తీసుకెళ్లే సమయంలో పలు జాగ్రత్తలు కూడా రోగి బంధువులకు చెప్పారు.పేషెంట్ ను వీల్ చైర్ లో కూర్చో పెట్టకుండా,స్ట్రేచ్చర్ లో పడుకో పెట్టుకునే ఇంటికి తీసుకెళ్లాలి.ఏమాత్రం విరుద్ధంగా వ్యవహరించిన సర్జరీ ఫేలయ్యే అవకాశం ఉందని చెప్పారు.దింతో పాశం వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు నిస్సహాయ స్థితిలో పడ్డారు.

 

పాశం వెంకటేశ్వర్లు నివాసం ఉండేది భైపాస్ రోడ్డు లోని చందమామ అపార్ట్ మెంట్ లోని 5 వ అంతస్థు లో.పాశం వెంకటేశ్వర్లు,అతని కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.స్ట్రేచ్చర్ పైన 5 అంతస్థులు ఎలా తీసుకెళ్లాలని ఆందోళన చెందారు.లిఫ్ట్ లో తీసుకెల్దామంటే స్ట్రేచ్చర్ ఏమాత్రం సరిపోదు.అపార్ట్ మెంట్ మెట్లపై మోసుకెల్దామంటే నా అనే వాళ్ళు లేకుండా అయ్యిందేనని సందిగ్ధంలో పడి కుటుంబ సభ్యులకు కంటతడి ఒక్కటే మిగిలింది.

అప్పుడు యూనియన్ జిల్లా అధ్యక్షులు,దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి యూనియన్ సభ్యులు తన కుటుంబ సభ్యులుగా భావించే నైజం కలిగిన మానవతావాది ఆకుతోట ఆదినారాయణ ముందడుగు వేసి,పాశం వెంకటేశ్వర్లు ను 5 వ అంతస్థులోకి చేర్చే బాధ్యతను తన భుజస్కందల పై వేసుకుని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో టీయూ డబ్ల్యూయుజె (టీజేఎఫ్) నాయకులు ఉత్కంఠం శ్రీను,మీడియా సెల్ ఇంచార్జ్ పెరబోయిన తిరుపతిరావు, ఖమ్మం నగర టెంజూ అధ్యక్షులు యలమందల జగదీష్,
ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు,కోశాధికారి కొరకొప్పుల రాంబాబు,జిల్లా నాయకులు బిక్కి గోపి,రామకృష్ణ,నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking