ఎస్సై సందీప్ రెడ్డి ని ఘనంగా శాలువాతో సత్కరించి సన్మానించిన జర్నలిస్టులు

మనోహరాబాద్, డిసెంబర్ 28 (ప్రజా బలం న్యూస్) :-  మెదక్ జిల్లా మనోహరబాద్ మండలానికి నూతనంగా ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన సందీప్ రెడ్డికి తూప్రాన్ డివిజన్ పరిధి జర్నలిస్టులు ఘనంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్ఐ. సందీప్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు చేపట్టిన నేను డ్రగ్స్, గంజాయి పై ప్రత్యేక దృష్టిని సారిస్తానని మండలంలోని యువకులు గంజాయికి అలవాటు పడి ఇబ్బందులకు గురవుతున్నారని ముందుగా ఉన్న సమాచారం మేరకు ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరిస్తానని అక్రమ మట్టిపై చర్యలు తీసుకుంటానని దొంగతనాలను అరికడతానని రోడ్లపై ప్రయాణించే వాహనదారులు హెల్మెట్లు సీటు బెల్ట్ లు ధరించి ప్రయాణించాలని ప్రమాదాల వలన ఇంట్లో వ్యక్తిని కోల్పోతే అది ఎంతో లోటు ఏర్పడుతుందని వారు వివరించారు. విధి నిర్వహణలో ఎలాంటి ప్రలోభాలకు గురికానాన్ని వారి సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రిపోర్టర్ పెద్ది గారి నాగేష్, మెదక్ జిల్లా స్టాప్ రిపోర్టర్ గడ్డం ప్రశాంత్ కుమార్,శివ గౌడ్, డివిజన్ రిపోర్టర్ సర్గల స్వామి, నవీన్ లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking