నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడి సాధించవచ్చు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్.

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 28 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కామేపల్లి నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడి సాధించి వచ్చని రైతులు పంటల సాగు చేసే క్రమంలో నాణ్యమైన విత్తనాలనే ఎంపిక చేసుకోవాలి ,దీంతో అధిక దిగుబడులు సాధించవచ్చని డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ అన్నారు. బుధవారం పండితాపురం గ్రామానికి చెందిన అంబడిపూడి మల్లిఖార్జున రావు అనే రైతు మిరప తోటలో క్రిష్ణవేణి,పవన్ సాయి సీడ్స్ హైబ్రిడ్ విత్తనాల వారు స్వర్ణముఖి రకంపై మిరప క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. విత్తనాల ఎంపికతోనే పంట అధిక దిగుబడి పొందడంతో పాటు పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని, తెగుళ్లును తట్టుకునే శక్తి ఉంటుందన్నారు. సుమారు ఎకరం 35 క్యింటాల దిగుబడి వచ్చిందని రైతు తెలిపాడు.అనంతరం రైతు మల్లిఖార్జునరావు ను కంపెనీ ప్రతినిధులు, రైతులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎండీ శంకర్ రెడ్డి, వేమారెడ్డి, జిల్లా సెల్స్ మేనేజర్ దిరిశాల వేణు, రైతుబంధు సమితి గ్రామ అధ్యక్షుడు బానోత్ నరసింహ నాయక్, రైతులు ధనియాకుల మాధవ్ రావు వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, రాంబాబు, అప్పారావు,పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking