పశువులు, పక్షుల సంరక్షణ చేపట్టేలా చర్యలు అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య

 

మేడ్చల్ ప్రజాబలం ప్రతినిధి డిసెంబర్ 28: మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా పశువులు, జంతువులు, పక్షుల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య అన్నారు.
బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సొసైటీ ఫర్ ప్రవెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ ఆన్ ఎనిమిల్స్ గవర్నింగ్ బాడీ (ఎస్పీసీఏ) మీటింగ్ను నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ దీనికి సంబంధించి భూమి సేకరణ, అవగాహన (అవేర్నెస్) కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండాలని సూచించారు. దీంతో పాటు పశువులు, జంతువులు, పక్షుల సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలను సూచించారు. జిల్లా వ్యాప్తంగా జంతుబలులు జరిగే చోట జరగకుండా అవసరమైన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో మరోసారి సమావేశం నిర్వహించేలోగా అన్ని రకాల చర్యలు చేపట్టాల్సిందిగా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా పశువైద్యాధికారి శేఖర్, ఎనిమల్ బర్త్ కంట్రోల్, క్రూయాలిటీ తదితర అంశాలపై వివరించారు. ఈ సమావేశంలో జిల్లా పశువైద్యాధికారితో పాటు జెడ్పి సీఈఓ దేవసహయం,జిల్లా ట్రాన్స్ పోర్ట్ అధికారి కిషన్, డిఎఫ్ ఓ జానకిరామ్, మార్కెటింగ్ అసిస్టెంట్ డైరెక్టర్, యానిమల్ వెల్ఫేర్ యాక్టివిస్ట్ ఎన్.ఎస్. ప్రవళిక, హన్మంతు, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking