జగిత్యాల, సెప్టెంబర్ 12:
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షిస్తులైన ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్ నాయకులు నక్క సతీష్ మాదిగ బీఆర్ ఎస్ పార్టీలో చేరారు. మంగళవారం నక్క సతీష్ తోపాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకోగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీని సంజయ్ కుమార్ నాయకత్వంలో నియోజకవర్గం మరింత బలపరచడానికి ఎల్లవేళలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మమత సతీష్, తాండ్ర జలంధర్, కొత్తూరు తిరుపతి, గంగారం, నర్సింగ్, అశోక్ ప్రశాంత్, తిరుపతి తోపాటు పలువురు ఉన్నారు.