ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 12 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ బదిలీ పై వెళుతున్న దీపకళ సేవలు మరువలేనివని, ఉద్యోగి సేవలు మరువలేనివి ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జై కిషన్ ఓజా అన్నారు.మంగళవారం పట్టణంలోని కళాశాలలో బదిలీ పై వెళుతున్న దీపకళ కు వీడ్కోలు సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ జై కిషన్ ఓఝా మాట్లాడుతూ…జూనియర్ అసిస్టెంట్ గా కళాశాల నిర్వహణలో ఎంతో ప్రభావవoతంగా, ఖచ్చితత్వంతో సేవలందించారన్నారు. కళాశాల కు న్యాక్ గుర్తింపు వచ్చే క్రమంలో కష్టపడి పని చేసిన వారిలో జూనియర్ అసిస్టెంట్ దీపకళ ముఖ్యమైన పాత్ర పోషించారని గుర్తు చేశారు. అనుభవం,అంకితం భావం కలిగిన జూనియర్ అసిస్టెంట్ దీపకళ అందరికీ ఆదర్శమని కొనియాడారు.ఉద్యోగికి బదిలీ సహజమే అయినప్పటికీ పని విషయంలో తాము ఇతరులకు ఆదర్శంగా నిలవడం ఎంతో ముఖ్యమైనదన్నారు. అంతకుముందు వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ గంగయ్య మాట్లాడుతూ…హైదరాబాద్ నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చి కళాశాల ఉన్నతిలో పాలుపంచుకున్న జూనియర్ అసిస్టెంట్ దీపకళ అందరికీ మార్గదర్శకంగా నిలిచారన్నారు.అంతకుముoదు అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది జూనియర్ అసిస్టెంట్ దీపకళతో గల అనుభవాలను, అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.అనంతరం శాలువా,పూలమాలలతో దీప కళ – ప్రవీణ్ దంపతులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.