బిసి కులాల ఆత్మ గౌరవ భవనాల శంకుస్థాపన కార్యక్రమం

 

శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రులు గంగుల కమాలకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్,శ్రీనివాస్ గౌడ్,మల్లారెడ్డి

శాసనసభ మాజీ స్పీకర్ మధుసుధనాచారి

శాసనసభ్యులు భేతి సుభాష్ రెడ్డి,ముఠా గోపాల్

మేడ్చల్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 5:తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇచ్చిన హామీ మేరకు ఆదివారం ఉప్పల్ భగయత్ లో వివిధ బిసి కులాల ఆత్మ గౌరవ భవనాల శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గంగుల కమాలకర్ తలసాని శ్రీనివాస్ యాదవ్,శ్రీనివాస్ గౌడ్,మల్లారెడ్డి,
శాసనసభ మాజీ స్పీకర్ మధుసుధనాచారి,శాసనసభ్యులు భేతి సుభాష్ రెడ్డి,ముఠా గోపాల్,బిసి కమిషన్ చైర్మన్ వకులాభరనం కృష్ణ మోహన్ రావు,ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం,స్థానిక కార్పొరేటర్ రజితారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ భారత దేశంలో ఎక్కడ లేనివిధంగా మన ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వెనుకబడిన తరగతుల సంక్షేమం కొరకై వారి అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు.అందులో భాగంగా ఆదివారం దాదాపు 22 బిసి కులాల ఆత్మ గౌరవ భవనాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమం ఇంతటితో ఆగకుండా వచ్చే దసరా నాటికి గొప్పగా నూతన భవనాలను ప్రారంభించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి వివిధ కుల సంఘాల నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking