చట్టాల అమలు పై సమీక్షా రాష్ట్ర హైకోర్టు జడ్జి యం.జీ ప్రియదర్శిని

వికారాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి:వికారాబాద్‌ జిల్లా : భారత రాజ్యాంగం ననుసరించి పార్లమెంటు చట్టాలను చేస్తుందని, అట్టి చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందని రాష్ట్ర హైకోర్టు జడ్జి ఎంజి ప్రియదర్శిని అన్నారు.శనివారం జిల్లా కోర్టు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వివిధ చట్టాల అమలు తీరుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఇందులో భాగంగా వైద్య, విద్య, స్త్రీ మరియు శిశు సంక్షేమం, పోలీసు శాఖల ద్వారా చేపట్టిన పనుల అమలుతీరును ఆయా శాఖల అధికారులతో అడిగి తెలుసుకున్నారు.

 

ఫోక్సో చట్టం బాధితులను ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చినప్పుడు వైద్యాధికారులు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు వైద్య చికిత్సలు అందజేస్తూ పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. విద్యాశాఖలో చాలామంది విద్యార్థులు డ్రాప్‌ అవుట్‌ అవుతున్నారని వారి పట్ల తీసుకున్న చర్యల విషయమై విద్యాశాఖ అధికారిని అడగగా, జిల్లాలో 632 మంది విద్యార్థులు డ్రాప్‌ అవ్వగా వారిని కౌన్సిలింగ్‌ చేసి తిరిగి పాఠశాలల్లో చేరే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు. ఇందులో ఎక్కువ శాతం మంది అమ్మాయిలు ఉన్నారని తెలియజేశారు. జిల్లాలో బాల్యవివాహాలను పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇలాంటి వివాహాలు చేసేవారు ప్రతి ఒక్కరూ శిక్షార్హులని వారికి తెలియజేసి కౌన్సిలింగ్‌ చేయాలని తెలిపారు. జిల్లాలో బాల్యవివాహాలు, భిక్షాటన, నిరక్షరాస్యాన్ని నిర్మూలించేందుకు అధికారులు విశేష కృషి చేయాలని కోరారు. ఫోక్సో కేసులపై పోలీసు శాఖ ద్వారా తీసుకుంటున్న చర్యలలో భాగంగా ఎక్కువమంది విద్యార్థి దశలో ఉన్న వారేనని ప్రత్యేకంగా కాలేజీలలో విద్యార్థులకు ఫోక్సు చట్టంపై అవగాహన కల్పించేందుకు పోలీసు శాఖ కృషి చేయాలన్నారు. ఫోక్సు చట్టం క్రింద బాధితులకు ఎప్పటికప్పుడు నష్టపరిహారం అందించాలని తెలిపారు.

 

సఖి సెంటర్‌ ద్వారా కూడా పోలీసు శాఖ సహకారంతో భార్యాభర్తల కేసులలో కౌన్సిలింగ్‌ నిర్వహించి పరిష్కరించాలన్నారు. అంగన్వాడి కేంద్రాలలో ప్రతి ఒక్కరికి న్యూట్రీషియన్‌ ఫుడ్‌ అందించాలని, పిల్లల ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. వికారాబాద్‌ జిల్లాను వెనుకబడిన జిల్లా అని అనకుండా జిల్లా అధికారులందరూ కొత్త జిల్లా ఏర్పడినందున అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని సూచించారు. బిక్షాటన చేసే పిల్లలను గుర్తించి వారికి అవసరమైన సహకారాన్ని అందించాలని తెలిపారు.. చైల్డ్‌ లైన్‌, రెవెన్యూ, పోలీసు శాఖలు వారికి కౌన్సిలింగ్‌ చేసి అవసరమైన రేషన్‌ కార్డులు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కార్డులు భిక్షాటనలను నిర్మించాలని సూచించారు. నేటి యువత గంజాయి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా పోలీసు శాఖ చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలో ముఖ్యంగా రైల్వే స్టేషన్‌ లు పాఠశాలల వద్ద ప్రత్యేక నిఘా పెట్టాలని అన్నారు. పేద ప్రజలకు జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ ద్వారా ఉచితంగా న్యాయ సేవలు అందించేందుకు బార్‌ అసోసియేషన్‌ సభ్యులు కృషి చేయాలన్నారు. పేద ప్రజలకు అన్యాయం జరిగితే అధికారులు వారికి మేమున్నామని భరోసా ఇవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ జడ్జి కే.సుదర్శన్‌, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్‌ కుమార్‌, అడిషనల్‌ ఎస్పీ మురళీధర్‌ రావు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మాధవరెడ్డి, సీనియర్‌ న్యాయమూర్తి డి బి శీతల్‌, జూనియర్‌ న్యాయమూర్తి కే. శ్రీకాంత్‌, వికారాబాద్‌ ఆర్డీవో విజయ కుమారి, జిల్లా అధికారులు, తాసిల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking