భోగి, సంక్రాంతి పండగ శుభాకాంక్షలు.. … జిల్లా కలెక్టర్ శరత్

 

ప్రజ బలం ప్రతినిది సంగారెడ్డి:13
భోగి, సంక్రాంతి పండగ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ జిల్లా ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు.
సూర్య భగవానుని గమనాన్ని బట్టి వచ్చే సంక్రాంతి పండుగ అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నదని పేర్కొన్నారు.
కాలగమనంలో వచ్చే మంచి మార్పుకి సంకేతంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటామని అన్నారు.
సంక్రాంతి మూడు రోజుల పండగని భోగి ,సంక్రాంతి, కనుమగా జరుపుకునే ప్రత్యేకత ఈ పండగదని అన్నారు.
సూర్యనారాయణుడి కృపతో జిల్లా పాడిపంటలతో విలసిల్లుతూ, ప్రజలందరూ భోగ భాగ్యాలతో సుభిక్షంగా ఉండాలని కలెక్టర్ కోరారు.
జిల్లా ప్రజలందరూ ఆనందోత్సాహాలతో పండగ జరుపుకోవాలని, అందరి ముంగిళ్ళలో సంక్రాంతి శోభ వెల్లివిరియాలని, సంక్రాంతి అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు తీసుకురావాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking