ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 17 : మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల రైల్వే స్టేషన్ లో రైలు లో అక్రమంగా తరలిస్తున్న 24 కిలో లో గంజాయిని మంచిర్యాల రైల్వే స్టేషన్ లో జీఆర్పీ పోలీసులు పట్టుకున్నారు. జీఆర్పీ ఎస్సై సుధాకర్ అధ్వర్యంలో సిబ్బంది రైల్వే స్టేషన్ లో తనిఖీ చేస్తుండగా ఒరిస్సా కు చెందిన రామ్ చంద్ర స్వైన్ వద్ద సుమారు 6.08.500 రూపాయల విలువ చేసే గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు కన్ష బాలాజీ స్వైన్ పరారీలో ఉన్నాడు.ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించారు.