రాష్ట్ర ప్రభుత్వం షరతులు లేని రైతు రుణమాఫీ అమలు చేయాలి….పుప్పాల భాస్కర్.

 

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తీరు చూస్తూ ఉంటే తప్పుడు హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పక్షాన రైతు రుణమాఫీ చేస్తానని మెదక్ చర్చి సాక్షిగా ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేసి ఈ రోజున రైతు రుణమాఫీకి మెలిక పెట్టడం విడ్డూరంగా ఉందని బిఆర్ఎస్ పార్టీ 129 సూరారం డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ అన్నారు . రాష్ట్రంలో దాదాపు 70 లక్షల పైగా ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేయాల్సింది ఉండగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఆహార భద్రత కార్డు తప్పనిసరి అని మెలిక పెట్టి కనీసం సగం మంది రైతులకు కూడా రైతు రుణమాఫీ అందకపోవడం, అదేవిధంగా రెన్యువల్ చేసుకున్నటువంటి రుణాలు వర్తించకపోవడం లాంటి షరతులు పెట్టడం సరికాదని తక్షణమే రైతులందరికీ రైతు రుణమాఫీ అందేలా చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ 129 సూరారం డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking