రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 26 జనవరి 2024: ప్రజలే ప్రభుత్వము, ప్రభుత్వమే ప్రజలని భావించి ముందుకు సాగేదే గణతంత్ర రాజ్యం, అట్టి భారతావనికి స్వాతంత్య్రం వచ్చిన15 ఆగస్ట్ 1947 తరువాత కీలకమైన భారత రాజ్యాంగాన్ని తయారు చేసేందుకు ఎంతోమంది మేధావులు, ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి చాలా రకాల అంశాలతో 26 నవంబర్ 1949 న అందరి ఆమోదంతో మన దేశ రాజ్యాంగాన్ని ఏర్పాటు గావించి 26 జనవరి 1950 న అమలులోకి తీసుకురావడం జరిగినదని, ఇంతటి విశిష్ఠత గల భారత గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా వీ ఆర్ 4 సహాయోగ్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో మణికొండ సెక్రేట్రియేట్ కాలనిలోగల స్వర్ణాలయమ్ (గోల్డెన్ టెంపుల్) యొక్క కూడలిలొ అంగ రంగ వైభవంగా భారత దేశ 75 వ గణతంత్ర దినోత్సవ త్రివర్ణ పతాకావిస్కరణ చేయడం జరిగినదని ఈ సందర్భంగా మణికొండ ప్రజానికమ్ తో పాటు కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం గావించిన పురజన ప్రముఖులందరికీ ట్రస్ట్ సభ్యులు శుభాభి వందనాలను తెలియ జేసినారు.