మద్యానికి, మత్తు పదార్థాలకు బానిసైన వారికి అత్యుత్తమ వైద్య సేవలందించేందుకు డి- అడిక్షన్ సెంటర్ ఎంతగానో మేలు చేస్తుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన డీ అడిక్షన్ సెంటర్ (మత్తు పదార్థాల విముక్తి కేంద్రం) ను ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసైన వారిని డీ అడిక్షన్ సెంటర్లో చేర్పించడం వలన వారిని మత్తు పదార్థాల నుండి పూర్తిగా దూరం చేయవచ్చునని తెలిపారు.డి అడిక్షన్ సెంటర్ ఆరు పడకలతో,అన్ని రకాల వసతులతో ఏర్పాటు చేయడం జరిగిందని, మానసిక వైద్య నిపుణులు, మాదకద్రవ్యాలను అలవాటును మాన్పించే నిపుణులైన వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తూ మత్తు పదార్థాల అలవాటును దూరం చేసేందుకు తోడ్పడుతుందని తెలిపారు.జిల్లాలోని వివిధ ప్రాంతాలలో మత్తుపదార్థాలకు బానిసైన వారిని ఇక్కడ చేర్పించేందుకు రెవెన్యూ, వైద్య, పోలీసు శాఖల సహకారంతో బాధితులను డి అడిక్షన్ సెంటర్లో చేర్పించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు తమ సమీపంలో ఎవరైనా మత్తు పదార్థాలకు బానిసైన వారు ఉంటే అడిక్షన్ సెంటర్లో చేర్పించాలని,మత్తు పదార్థాల నుంచి విముక్తి పొందవచ్చు అని తెలిపారు.అలాగే ఓపి స్లిప్పుల పంపిణీ కేంద్రము,పలు విభాగాలను పరిశీలించి వైద్యులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రజలకు అన్ని రకాల వైద్య సేవల పట్ల అవగాహన కలిగేలా ఆసుపత్రిలో సూచికల బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.పోలీసు అవుట్ పోస్టును నిరంతరం కొనసాగించి, మెరుగైన భద్రతను కల్పించాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గునియా వంటి సీజనల్ వ్యాధులు వాపిస్తున్న నేపథ్యంలో ఆసుపత్రిలో అధిక సంఖ్యలో చేరుతున్న రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలని ఆదేశించారు.రానున్న రోజుల్లో ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థుల కోసం ప్రత్యేక బోధన గదిని ఏర్పాటు చేయాలని సూచించారు. ఆసుపత్రి ప్రాంగణంలో వాహనాల పార్కింగ్ నకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. రాజేందర్,ఆసుపత్రి పర్యవేక్షకులు డా. సునీల్ కుమార్, వైద్యులు సురేష్, సమత,పవన్, అరుణ్,సురేష్, అధికారులు ఎడి విజయ,సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking