మహా అన్నదాన కార్యక్రమం

 

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 11

జమ్మికుంట పట్టణం 24వ వార్డు, గణేష్ నగర్ లో గణపతి నవరాత్రుల ఉత్సవం భాగంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో బాగుండాలని రాజేష్ ఠాకూర్ రాకేష్ ఠాకూర్ ల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్ హాజరయ్యారు. గర్రెపల్లి నిరూపరాణి ఇల్లందుల శ్రీనివాస్,భక్తులందరూ ఆ గణనాధుని ఆశీస్సులు పొంది అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking