రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహించి బదిలీ అయిన అమోయ్ కుమార్
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయిన జిల్లా ఇంఛార్జి కలెక్టర్ హరీశ్
మేడ్చల్ ప్రజాబలం ప్రతినిధి జనవరి 31:మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌గా డి.అమోయ్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది కలెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో భాగంగా ఇప్పటి వరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న అమోయ్ కుమార్ మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఇప్పటి వరకు జిల్లా ఇంఛార్జి కలెక్టర్‌గా విధులు నిర్వహించిన హరీశ్‌ను రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేశారు.