450 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్ ఫెసిలిటీ ఐటీసిని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
మెదక్ జిల్లా మనోహరబాద్ లో ఐటిసి ఏర్పాటు
ప్రజాబలం ప్రతినిధి:మెదక్, జనవరి 30, : ఐటీసీ యొక్క అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్ ఫెసిలిటీ ని 450 కోట్ల రూపాయల వ్యయంతో తెలంగాణాలోని మెదక్ జిల్లా మనోహరబాద్ వద్ద ఐటీసీ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సంజీవ్ పురి సమక్షంలో తెలంగాణా రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్యం, ఐటీ, ఈ అండ్ సీ, పురపాలక పరిపాలన మరియు నగరాభివృద్ధి శాఖామాత్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దాదాపు 59 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ 16.5 లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో ఉంటుందన్నారు. మొదటి దశలో 450కోట్ల రూపాయలను పెట్టుబడి పెడుతుందని తెలిపారు. సెప్టెయినబల్ అగ్రి-వాల్యూ చైన్ వ్యాప్తంగా భారీ స్థాయిలో జీవనోపాధి అవకాశాలను ఇది సృష్టించనుందన్నారు. ఈ ప్యూచర్ రెడీ ఫెసిలిటీ సమగ్రమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను కలిగి ఉండటంతో పాటుగా ఐటీసీ యొక్క ప్రపంచశ్రేణి ఫుడ్ బ్రాండ్లు అయిన ఆశీర్వాద్ ఆటా సన్ఫీస్ట్ బిస్కెట్లు, బింగో చిప్స్ మరియు యిప్పీ నూడిల్స్ వంటి వాటిని దశల వారీగా ఉత్పత్తి చేయనుందన్నారు. మెదక్ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఐటీసీ యొక్క పెట్టుబడులు, రాష్ట్ర తయారీ రంగానికి అదనపు విలువను జోడిరచడంతో పాటుగా సమ్మిళిత అగ్రి వాల్యూ చైన్స్ కు మద్దతు అందించనుందన్నారు. పర్యావరణ పరిరక్షణ దిశగా ఐటీసీ యొక్క నిబద్ధతకు అనుగుణంగా, మెదక్ యూనిట్ స్వచ్ఛ ఇంధనాన్ని తమ రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ మాడ్యూల్స్ ద్వారా ఉత్పత్తి చేయనుందన్నారు. ప్లాటినమ్, లెవల్ గ్రీన్ బిల్డింగ్, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ చేత ధృవీకరించబడిన ఈ ప్రపంచశ్రేణి ఫ్యాక్టరీలో శాస్త్రీయంగా డిజైన్ చేసిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థ ఉండటం చేత గరిష్టంగా నీటి పొదుపును అందించడంతో పాటుగా భూగర్భ జలాలపై ఆధారపడటం తగ్గుతుందని తెలిపారు. తద్వారా పర్యావరణంపై ఈ యూనిట్ ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తుందన్నారు. మెదక్ లోని ఈ ఫెసిలిటీలో మహిళా భాగస్వామ్యం పెంపొందించాలనే ఐటీసీ యొక్క ప్రయత్నాలలో భాగంగా ఉంటుందన్నారు. ఈ ఫెసిలిటీతో మొత్తంమ్మీద ఫ్యాక్టరీ స్థాయిలో 50% మహిళలు విధులను నిర్వర్తిస్తున్నట్లవుతుందని తెలిపారు అనంతరం తెలంగాణాలో ఈ ఫెసిలిటీ ప్రారంభం గురించి ఐటీసీ లిమిటెడ్ చైర్మన్ శ్రీ సంజీవప్పరి మాట్లాడుతూ ‘‘వ్యవసాయం, తయారీ మరియు సేవల రంగాలలో తెలంగాణాలో తమ కార్యకలాపాలను ఐటీసీ విస్తృతం చేస్తుందని తెలిపారు. ఈ రాష్ట్రం అందిస్తున్న అసాధారణ తోడ్పాటుతో పాటుగా ఇక్కడ ఉన్న అవకాశాలతో మేము మెదక్ లోని మనోహరబాద్ లో ప్రపంచశ్రేణి ఇంటిగ్రేటెడ్ ఫుడ్స్ మాన్యుఫాక్చరింగ్ మరియు లాజిస్టిక్స్ ఫెసిలిటీలో పెట్టుబడులు పెట్టామని తెలిపారు. పర్యావరణ అనుకూల మరియు సమ్మిళిత వృద్ధికి తోడ్పాటు అందించడంతో పాటుగా పునరుత్పాదక శక్తి యొక్క విస్తృత శ్రేణి వినియోగాన్ని ప్రోత్సహించే బహుముఖ కార్యక్రమాలతో ఈ యూనిట్ పర్యావరణ అనుకూల కార్యకలాపాలకు ప్రతీకగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము’’ అని అన్నారు. తెలంగాణాలో విస్తృత శ్రేణిలో కార్యకలాపాలను ఐటీసీ లిమిటెడ్ నిర్వహిస్తుందన్నారు.

కీలకమైన రంగాలలో గణనీయమైన పెట్టుబడులు పెట్టడం ద్వారా తమ కార్యకలాపాలను విస్తృతం చేసిందన్నారు. వైవిధ్యమైన వ్యాపార కార్యకలాపాలతో ఈ కంపెనీ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన తోడ్పాటుదారులైనటువంటి వ్యవసాయ, తయారీ, సేవల రంగాలకు అసాధారణ తోడ్పాటును అందిస్తుందని తెలిపారు. తెలంగాణాలో ఐటీసీ యొక్క రెండు అతిపెద్ద పేపర్ తయారీ కేంద్రాలు భద్రాచలం మరియు బొల్లారంలో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పేపర్ బోర్డ్స్ తయారీని మరింత వేగవంతం చేసేందుకు ఐటీసీ యొక్క ఇంటిగ్రేటెడ్ యూనిట్ భద్రాచలంలో 2వేల కోట్ల రూపాయల పెట్టుబడితో నూతన బాయిలర్ సాంకేతికతను ఏర్పాటుచేసిందని వివరించారు. దీని కారణంగా ఇంధనంగా బొగ్గుపై ఆధారపడటం గణనీయంగా తగ్గుతుందన్నారు. దానితో పాటుగా మిల్లు యొక్క పునరుత్పాదక విద్యుత్ వాటా గణనీయంగా పెరిగి పల్స్ మరియు మిల్ సామర్థ్యం సైతం గణనీయంగా పెరుగుతుందన్నారు.

సంస్థ యొక్క పేపర్ బోర్డ్స్ మరియు స్పెషాలిటీ పేపర్స్ వ్యాపారం కారణంగా పర్యావరణ అనుకూల అటవీకరణ కార్యక్రమాలకు సైతం తోడ్పాటునందించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2,50,000 ఎకరాలు ఈ తరహా అడవులు ఉన్నాయని,. బహుళ పంటలను ప్రోత్సహిస్తూనే, రైతుల ఆదాయం మెరుగుపరుస్తూ మెరుగైన పర్యావరణ అనుకూల ఫలితాలను అందించే రీతిలో ప్రపంచవ్యాప్తంగా బెంచ్ మార్క్ చేయబడిన వ్యవసాయ-అటవీ కార్యక్రమాలకు కంపెనీ నేతృత్వం వహించిందని వివరించారు. ఐటీసీ యొక్క అగ్రి-బిజినెస్, వరి, జొన్న, తృణధాన్యాలు మరియు మిర్చి, పసుసు వంటి వంటలపై ప్రత్యేకంగా దృష్టి సారించి పంటల అభివృద్ధి కోసం తెలంగాణాలోని రైతులతో అతి సన్నిహితంగా పనిచేస్తుందని,. ఈ కంపెనీ పెద్ద మొత్తంలో ఆహార పదార్థాలను రాష్ట్రం నుంచి సేకరించి ఎగుమతి చేయడం ద్వారా తెలంగాణా రైతులను అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానిస్తుందన్నారు. డిజిటల్ సాంకేతికతల శక్తిని రైతుల చెంతకు తీసుకురావడంలో భాగంగా ఐటీసీ వినూత్నమైన ఫిజిటల్ నమూనా ఐటీసీ మార్స్- మెటా మార్కెట్ ఫర్ అడ్వాన్స్డ్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ సర్వీసెస్- ను విడుదల చేసిందన్నారు. రైతుల అవసరాలను తీర్చే సొల్యూషన్ ఇంటిగ్రేటర్ ఇది పనిచేస్తుంది. నేడు రాష్ట్రంలో ఐటీసీ మార్స్ పర్యావరణ వ్యవస్థ 6 ఎఫ్పీఓలతో కలిసి పనిచేయడంతో పాటుగా 1600 మందికి పైగా రైతులకు ప్రయోజనం కలిగిస్తుందన్నారు. దీనిని 15 కు విస్తరించడం ద్వారా రాబోయే సంవత్సరానికి 45 వేల మంది రైతులకు ప్రయోజనం కలిగించనున్నారు. ఐటీసీ యొక్క క్లైమెట్ స్మార్ట్ అగ్రికల్చర్ ప్రోగ్రాము వాతావరణ మార్పుల ప్రమాదాలకు వ్యతిరేకంగా రాష్ట్ర రైతులలో స్థిరత్వం పెంపొందించే లక్ష్యంతో బెటర్ కాటన్ ఇనీషియేటివ్ కింద 20500 ఎకరాలలో పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను అందిస్తుంది. ఈ కార్యక్రమాలు 5400 మంది రైతులకు ఇప్పటి వరకూ ప్రయోజనం కలిగించడంతో పాటుగా వ్యవసాయ సాగు పరంగా ఖర్చు 20% తగ్గించింది. అంతేకాకుండా వరి సాగు పరంగా 25% నీటిని ఆదా చేయగలిగింది.. అదనంగా, రాష్ట్రంలో ఐటీసీ యొక్క వాటర్ స్టీవార్డ్ పిప్ ప్రోగ్రామ్ 83,500 ఎకరాలను కవర్ చేయడంతో పాటుగా మొత్తంమ్మీద 9 లక్షల క్యూబిక్ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం సృష్టించింది. రాష్ట్రంలో తమ సీఎస్‌ఆర్ కార్యకలాపాలను సైతం ఐటీసీ విస్తరించింది. వీటిలో మహిళా సాధికారిత, నైపుణ్యాభివృద్ధి, ప్రాథమిక విద్య పశు సంరక్షణ, ఆరోగ్యం,పారిశుద్ధ్యం మరియు ఘన వ్యర్థాల నిర్వహణ వంటివి ఉన్నాయి.