ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్ జిల్లాలోని యూట్యూబర్స్ న్యూస్ చానల్స్ నిర్వాహకులు, అందరూ అందిస్తున్న సేవలకు తగిన విధంగా గుర్తింపునిచ్చి అధికారిక గుర్తింపు కార్డులు జారీ చేయాలని కోరుతూ బుధవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ కు అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఇతర సంస్థల మీడియా నిర్వాహకులకు పాత్రికేయులకు ఇస్తున్న మాదిరే యూట్యూబర్స్ న్యూస్ ఛానల్స్ వారికి కూడా అధికారిక గుర్తింపు ఇవ్వాలని కోరారు. నిర్మల్ జిల్లాలోని సుమారు 67 యూట్యూబర్స్ న్యూస్ ఛానల్స్ వారు సంఘంగా ఏర్పడి ఈ విషయమై రాజ్యాంగబద్ధమైన రీతిలో ముందుకెళ్తున్నామని అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ ఉస్మాన్ తెలిపారు. నిర్మల్ జిల్లాలోని ఆయా ప్రభుత్వ కార్యాలయాల ప్రభుత్వ కార్యక్రమాలు ఇతర కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని యూట్యూబర్స్ న్యూస్ చానల్స్ వారికి కూడా ఎప్పటికప్పుడు డిపి ఆరు ద్వారా తెలియజేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ ఈ విషయంలో తగు చర్యలు తీసుకొని న్యాయం చేయడం జరుగుతుందని భరోసా కల్పించారు. జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన వారిలో అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు రషీద్ ఆలం,ఉపాధ్యక్షులు తోగిటి రాంప్రసాద్, ప్రధాన కార్యదర్శి గైనీ భోజన్న ,సహాయ కార్యదర్శి అజీజ్ సిద్ధిఖీ ,సంయుక్త కార్యదర్శి వి. కృష్ణ, కోశాధికారి బొబ్బిలి ప్రసాద్ ,గౌరవ సభ్యులు తాహిర్ పఠాన్, తోగిటి విజయ ప్రసాద్, వినయ్ పాల్ ,శేఖ్ షాదుల్లా హుస్సేన్, తయబ్ బిన్ సల్లా తదితరులు ఉన్నారు