స్ట్రాంగ్ రూమ్ లను పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ తో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్
ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 26 (ప్రజాబలం) ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఇవిఎం స్ట్రాంగ్ రూమ్‌లను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ తో కలిసి గురువారం పరిశీలించారు. శాసనసభ ఎన్నికల దృష్ట్యా ఇవిఎంల భద్రత, రిషిప్షన్ కేంద్ర ఏర్పాటుకు స్థానిక సెయింట్ జోసెఫ్ హైస్కూల్ లో ఖమ్మం నియోజకవర్గ, ఖమ్మం రూరల్ మండలం పొనేకల్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో పాలేరు నియోజకవర్గానికి చెందిన ఇవిఎం లు స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసియున్నారు. ఇవిఎంల భద్రతకు గదులు, భద్రతకు చేపట్టిన చర్యల గురించి వారు పరిశీలించారు. బ్యారికెటింగ్, సిసి కెమెరాలు పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ డోర్ సంతకాలు, సీళ్లను పరిశీలించారు. ఇవిఎం కమీషనింగ్ గదిని పరిశీలించారు. ఇవిఎం ల కమీషనింగ్ పై సూచనలు చేశారు. చుట్టూ తిరిగి పరిశీలించారు. భద్రత విషయమై సూచనలు చేశారు. లైటింగ్ విషయమై అడిగి తెలుసుకున్నారు. సిసి కెమెరాలు స్ట్రాంగ్ రూమ్ చుట్టూతా ఉండాలని, సీఆర్పీ బలగాలు స్ట్రాంగ్ రూమ్ చుట్టూ కాపలా ఉండాలని అన్నారు. 24 గంటల పటిష్ట నిఘా ఉండాలన్నారు. రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు స్ట్రాంగ్ రూమ్ ను సందర్శిస్తూ ఉండాలన్నారు ఈ సందర్భంగా ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు డిసిపి ప్రసాద్ రావు, ఎస్డీసి రాజేశ్వరి, ఎసిపిలు గణేష్, బస్వారెడ్డి, సారంగపాణి, మునిసిపల్ ఇఇ కృష్ణలాల్, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, తహసిల్దార్లు సిహెచ్. స్వామి, రామకృష్ణ, అధికారులు తదితరులు ఉన్నారు.