దౌర్జ‌న్యాల‌కు, బెదిరింపుల‌కు దిగ‌డం బీజేపీ నైజం

 

భ‌క్తుల ప‌ట్ల ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాదు
పండ‌గ‌ల‌ను రాజ‌కీయ వేదిక‌లుగా ఉప‌యోగించుకోవ‌డం మంచిది కాదు
నిర్మ‌ల్ ప్ర‌జ‌లంతా దీన్ని గ‌మ‌నిస్తున్నారు
అభివృద్ధి,సంక్షేమ ప‌థ‌కాలే బీఆర్ఎస్ కు శ్రీరామ ర‌క్ష‌: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మ‌ల్, అక్టోబ‌ర్ 26: బీఆర్ఎస్ ప్ర‌భుత్వం హాయంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించి ఓటు అడుగుతామ‌ని, బీజేపీ మాదిరి దౌర్జ‌న్యాల‌కు దిగ‌డం, బెదిరించ‌డం మా నైజం కాద‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌లంతా దీన్ని గ‌మ‌నిస్తున్నార‌ని, బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు సంయ‌మ‌నంతో ఉండాల‌ని సూచించారు.అధికార దుర్వినియోగానికి పాల్ప‌డ్డార‌నే బీజేపీ నేత‌ల ఆరోప‌ణ‌ల‌ను కొట్టిపారేశారు.
ద‌స‌రా ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా మ‌హాలక్ష్మి ఆల‌య ప్రాంగ‌ణంలో జ‌రిగిన వేడుక‌ల్లో బీజేపీ నేత‌లు వ్యవ‌హ‌రించిన తీరును మంత్రి ఖండించారు. శాస్త్రిన‌గ‌ర్ క్యాంప్ కార్యాల‌యంలో మంత్రి మాట్లాడుతూ. మ‌హ‌ల‌క్ష్మి ఆల‌య ప్రాంగ‌ణంలో ద‌స‌రా ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా వేడుక‌ల‌ను నిర్వ‌హించడం అన‌వాయితీగా వ‌స్తుంద‌ని, ప్ర‌తీ సంవ‌త్స‌రం మాదిరి ఈ సారి కూడా సంప్ర‌దాయ బ‌ద్దంగా వేడుక‌లు నిర్వ‌హించార‌ని అన్నారు. ఇంకా బీఆర్ఎస్ ప్ర‌భుత్వం అధికారంలో ఉంద‌ని, ఇది అప‌ద్ధ‌ర్మ ప్ర‌భుత్వం కాద‌ని, ఎమ్మెల్యేగా,మంత్రిగా స‌భ వేదిక‌పైకి మ‌మ్మ‌ల్ని ఆహ్వానించార‌ని స్ప‌ష్టం చేశారు.మ‌హ‌లక్ష్మి ఆల‌యాన్ని కోట్లాది రూపాయల‌తో అద్బుతంగా అభివృద్ధి చేశామ‌ని, భ‌క్తులు కూడా సంతోషం వ్య‌క్తం చేస్తూ.ఎంతో వేడుక‌గా పండుగ జ‌రుపుకుంటే.ఇది రుచించ‌ని కొంత‌మంది బీజేపీ నేత‌లు నానా హంగామ చేశార‌ని మండిపడ్డారు. ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో సంబ‌రాలు చేసుకుంటే. గంద‌ర‌గోళం సృష్టించే ప్ర‌య‌త్నం చేశార‌ని ద్వ‌జ‌మెత్తారు. మ‌హిళ‌లు, చిన్న‌పిల్లలు ఇబ్బందిప‌డుతున్నార‌ని కూడా చూడ‌కుండా భ‌యందోళ‌నకు గురి చేయ‌డం స‌రికాద‌ని హిత‌వు ప‌లికారు. పండ‌గ‌ల‌ను కూడా రాజ‌కీయ వేదిక‌గా ఉప‌యోగించుకోవ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.బీజేపీ నేత‌లు రెచ‌గొట్టే ప్ర‌య‌త్నాలు చేసినా.బీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఎంతో సంయ‌మ‌నం పాటించార‌ని పేర్కొన్నారు.వీహెచ్పీ నేత‌లు కూడా బీజేపీ నేత‌ల తీరును త‌ప్పుప‌ట్టార‌ని గుర్తు చేశారు.
భ‌క్తుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసే విధంగా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాదని, గుండాయిజం, రౌడీయిజం చేస్తూ భ‌క్తుల ప‌ట్ల ఇలా వ్య‌వ‌హ‌రిచ‌డం బీజేపీ నైజాన్ని బ‌య‌ట‌పెడుతుంద‌న్నారు. నామినేష‌న్ల ప్ర‌క్రియ ఇంకా ప్రారంభం కూడా కాలేద‌ని, ఇప్పుడే ఇలా వ్య‌వ‌హ‌రిస్తే.రానున్న రోజుల్లో ఇంకేం చేస్తారో ప్ర‌జ‌లు అని ఆందోళ‌న చెందుతున్నార‌ని వెల్ల‌డించారు. ఏది ఏమైనా బీఆర్ఎస్ అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలే మాకు శ్రీరామ ర‌క్ష అని, వాటిని ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తామ‌ని, మేనిపెస్టోలో ఇచ్చిన హ‌మీల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ళి ఓట్లు అడుగుతామ‌ని స్ప‌ష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking